Advertisement
Google Ads BL

డైరెక్టర్స్‌ని మహేష్ భయపెట్టేస్తున్నాడుగా?


మహేష్ బాబు.. రంగస్థలం లాంటి భారీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్ నే రిజెక్ట్ చేసిన తర్వాత మహేష్ ని స్టోరీ లైన్ తో అయితే లైన్ లో పెట్టొచ్చు కానీ.. పూర్తి స్క్రిప్ట్ తో మెప్పించాలంటే.. కాస్త కష్టమంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సెటైర్స్ వేస్తున్నారు. సుకుమార్ తో క్రియేటివ్ డిఫ్రెన్సెస్ వలన సినిమా చెయ్యడం లేదని ప్రకటించిన మహేష్ ని పూర్తి కథతో ఇంప్రెస్స్ చెయ్యాలంటే నిజంగానే దర్శకులు టెంక్షన్ పడుతున్నారట. స్టోరీ లైన్ తో మెప్పించిన సుకుమార్ పూర్తి కథతో మహేష్ ని ఇంప్రెస్స్ చేయలేకపోయిన విషయం తెలిసిందే. ఇక అనిల్ రావిపూడి తో మహేష్ ని త్వరలోనే పట్టాలెక్కబోతుంది అంటున్నారు. కానీ పూర్తి క్లారిటీ లేదు. ఎందుకంటే అనిల్ కూడా పూర్తి స్క్రిప్ట్ మహేష్ దగ్గర నేరేట్ చేయలేదు.

Advertisement
CJ Advs

ఇక తాజాగా గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్.. గీత ఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. గీత గోవిందం బ్లాక్ బస్టర్ తో పరశురామ్ పేరు మాములుగా మార్మోగలేదు.... ఓ రేంజ్ లో దర్శకుడు పరశురామ్ కి పేరొచ్చింది. అయితే తర్వాత పరశురామ్, మహేష్ బాబు కి ఒక స్టోరీ లైన్ రెడీ చేసి అల్లు అరవింద్ ద్వారా మహేష్ ని అప్రోచ్ అయ్యాడు. అయితే మహేష్ కి పరశురామ్ తన స్టోరీ లైన్ వినిపించాడట... స్టోరీ లైన్ ఓకే కానీ... ఫుల్ స్క్రిప్ట్ తో పరశురామ్ ని రమ్మని మహేష్ చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి పరశురామ్ స్టోరీ లైన్ తో మెప్పించిన ఫుల్ స్క్రిప్ట్ తో మహేష్ ని ఇంప్రెస్స్ చెయ్యడానికి బాగా ప్రిపేర్ అవుతున్నాడట. మరి మహేష్ కి సరిగ్గా ఆ కథ నచ్చకపోతే.. పరశురామ్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే మహేష్ కి కథచెప్పి ఒప్పించాలంటే.. కాస్త టెంక్షన్... కాదు కాదు కంగారుపడుతున్నారట దర్శకులు. 

Mahesh fear to Telugu directors:

Mahesh Babu wants Full Script From Directors
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs