Advertisement
Google Ads BL

త్రివిక్రమ్, అల్లు అర్జున్ మూవీ స్టోరీ లైన్ ఇదే?


అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబో ఇంకా సెట్స్ మీదకెళ్ళలేదు కానీ.. వీరి కాంబో మీద మాత్రం రోజుకో న్యూస్ మీడియాలో వినబడుతూనే ఉంది. త్వరలోనే సెట్స్ మీదకెళ్ళబోతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు రెండూ హిట్ అవడంతో.. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారని మెగా ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా వున్న త్రివిక్రమ్, అల్లు అర్జున్ కోసం హీరోయిన్స్ ని, ఇతర నటీనటులను ఫైనల్ చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నాడు. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే ని ఫిక్స్ చేసాడని.. సెకండ్ హీరోయిన్‌గా కేథరిన్ పేరు పరిశీలనలో ఉన్నదనే టాక్ ఉంది.

Advertisement
CJ Advs

అయితే బన్నీ - త్రివిక్రమ్ సినిమా మొదట్లో ఒక బాలీవుడ్ సినిమాకి రీమేక్ అన్నప్పటికీ.. తర్వాత ఫ్రెష్ కథతోనే ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. అయితే త్రివిక్రమ్ - బన్నీ కథ ఒక అబద్దం చుట్టూతానే తిరగబోతుందనేది లేటెస్ట్ సమాచారం. జులాయి సినిమా డబ్బు కొట్టేసిన ఒక విలన్ కి చెక్ పెట్టే ఓ తెలివిగల అబ్బాయి పాత్రలో అల్లు అర్జున్ కనిపిస్తే.. సన్నాఫ్ సత్యమూర్తి లో తండ్రి మీద ఎటువంటి మచ్చ లేకుండా ప్రేమతో తుడిచేసే కుర్రాడిగా అదరగొట్టాడు. మరి ఇప్పుడు ఈ సినిమాలో అల్లు అర్జున్ అనుకోకుండా ఒక అబద్దం చెప్పగా... ఆ అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నంలో కామెడీ పండిస్తూ కనబడతాడట. ఇక ఆ అబద్దం చివరికి నిజమవుతుంది. 

మరి ఆ అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నంలో కామెడీ పండిస్తూ.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తో ఈ సినిమా ఉండబోతుందనేది లేటెస్ట్ న్యూస్. మరి మామూలుగానే త్రివిక్రమ్ డైలాగ్స్ మాటలు తూటాలుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. ఇక అరవింద సమేత లో త్రివిక్రమ్ మార్క్ కామెడీ మిస్ అయ్యిందని అందరూ అన్నారు. ఈసారి అల్లు అర్జున్ సినిమాలో ఆ కామెడీ ఎక్కడా మిస్ కాకుండా త్రివిక్రమ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

Trivikram and Allu Arjun Movie Story line Leaked:

This is the Bunny next film Story line
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs