Advertisement
Google Ads BL

జనసేనకి మెగా హీరోయిన్ ప్రచారం..!


మెగాబ్రదర్‌ నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక వెబ్‌సిరీస్‌లు, టివీ షోలకు హోస్ట్‌గా చేయడమే కాదు.. నాలుగైదు చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది. కానీ ఆమెకు నటిగా మంచి పేరే వచ్చినా ఆమె నటించిన ఏ చిత్రం కూడా కమర్షియల్‌గా హిట్‌ కాలేదు. కాగా ప్రస్తుతం ఆమె ‘సూర్యకాంతం’ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంది. ఈ చిత్రానికి షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్‌ ప్రణీత్‌ దర్శకత్వం వహిస్తుండగా, నిహారికతో పాటు రాహుల్‌ విజయ్‌ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. ప్రణీత్‌కి దర్శకునిగా ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. ఈ చిత్రాన్ని నిర్వాణ సినిమాస్‌ బేనర్‌ వారు నిర్మించగా, నిహారిక అన్నయ్య వరుణ్‌తేజ్‌ సమర్పిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం చూసి ఎంతో నచ్చిన వెంటనే ప్రముఖ నిర్మాత, పంపిణీ దారుడు దిల్‌రాజు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేసేందుకు ముందుకు వచ్చాడు. దిల్‌రాజుకి ఈ ఏడాది నిర్మాతగా ‘ఎఫ్‌2’తో పాటు పంపిణీదారునిగా నందమూరి కళ్యాణ్‌రామ్‌ ‘118’ కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో దిల్‌రాజు ఎంట్రీ తర్వాత నిహారికకి ‘సూర్యకాంతం’ చిత్రం ఖచ్చితంగా హిట్‌ని ఇస్తుందనే నమ్మకం కలుగుతోంది. కాగా ఈ చిత్రం మార్చి29న విడుదల కానుంది. 

ఇక తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీకి నిహారిక తండ్రి నాగబాబు గట్టిగా మద్దతు ఇస్తున్నాడు. ఇప్పటికే నాగబాబు జనసేనకి 25లక్షలు, వరుణ్‌తేజ్‌ కోటి రూపాయల విరాళాలు ఇచ్చారు. తాజాగా నిహారిక కూడా తన తండ్రి, సోదరుడి దారిలోనే పవన్‌ జనసేనకి మద్దతు తెలుపుతోంది. సూర్యకాంతం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏపీలోని పలు ప్రాంతాలలో ఆమె పర్యటిస్తోంది. 

ఈ సందర్భంగా నిహారిక ఓ సభలో మాట్లాడుతుండగా, జనాలు పవన్‌కళ్యాణ్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేస్తూ నిహారికను ఉక్కిరిబిక్కిరిచేశారు. దాంతో నిహారిక మాట్లాడుతూ, ప్రజలకోసం బాబాయ్‌ ఎంతో కష్టపడుతున్నాడు. నాకు ఇక్కడ ఓటు లేదు. కాబట్టి మీరందరు బాబాయ్‌కి ఓటు వేసి గెలిపించండి. ఇక టీ గ్లాస్‌ పట్టుకుని ఉన్న ఫొటోలను కూడా నేను ఎన్నికల ప్రచారంలో భాగంగా పోస్ట్‌ చేస్తాను.. అంటూ మెగాభిమానులలో జోష్‌ని పెంచింది. 

Mega Heroine supports Janasena:

Naga Babu, Varun tej and Niharika supports Pawan Kalyan Janasena
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs