ఆకాష్ పూరి ‘రొమాంటిక్’లో మకరంద్ దేశ్ పాండే
యువ కథానాయకుడు ఆకాష్ పూరి నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. ఆకాష్ జోడిగా కేతికా శర్మ నటిస్తుంది. అనిల్ పాదూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా గోవాలో చిత్రీకరణను జరుపుకుంటుంది. ప్రముఖ టెలివిజన్ యాంకర్, నటి దిరాబేడీ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో విలక్షణ నటుడు ఈ సినిమాలో వర్క్ చేయనున్నారు. ఆయనే మకరంద్ దేశ్ పాండే. దాదాపు దశాబ్దం తర్వాత మకరంద్ దేశ్ పాండే నటిస్తున్న తెలుగు స్ట్రయిట్ మూవీ ఇదే. ఈ చిత్రంలో ఇంకా రాజీవ్ కనకాల, దివ్యదర్శిని, మందిరా బేడి అందరూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
ప్రముఖ దర్శకుడు, ఆకాష్ పూరి తండ్రి పూరి జగన్నాథ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు అందిస్తున్నారు. పూరి, ఛార్మీ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. లావణ్య సమర్పిస్తున్నారు.
నటీనటులు
ఆకాష్ పూరి, కేతిక శర్మ, మందిరా బేడీ తదితరులు
సాంకేతిక నిపుణులు
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు: పూరి జగన్నాథ్
దర్శకత్వం: అనిల్ పాదూరి,
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్
సమర్పణ: పూరి లావణ్య
సంస్థలు: పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్