Advertisement
Google Ads BL

118 సక్సెస్ ని మా నాన్న గారికి అంకితమిస్తున్నాం... హీరో కల్యాణ్ రామ్


నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నివేత థామస్,  హీరోయిన్స్ గా కె.వి గుహన్ దర్శకత్వంల్ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పతాకంపై మహేష్ ఎస్. కోనేరు నిర్మించిన హార్రర్ థ్రిల్లర్ చిత్రం 118. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో హీరో కళ్యాణ్ రామ్, హీరోయిన్స్ నివేత థామస్, షాలిని పాండే, దర్శకుడు కె.వి.గుహన్, నటులు శ్రావణ్, గగన్ విహారి, ముక్తాల్, ఇస్మాయిల్, తంబి దొరై, రచయిత హర్షవర్ధన్, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, ఫైట్ మాస్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

ముఖ్య అతిధిగా విచ్చేసిన దిల్ రాజు సక్సెస్ షీల్డ్ లను ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కి అందించారు. 

దిల్ రాజు మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూటర్ గా 23 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. ఈ ప్రయాణంలో ఎన్నో సక్సెస్ ఫుల్ ఫిలిమ్స్ రిలీజ్ చేసాం. ఈ మధ్య స్రవంతి రవికిశోర్ గారి సినిమా అడ్వాన్స్ తీసుకోకుండా  రిలీజ్ చేసాం. ఆయన ఫైనల్ గా వచ్చి కలెక్షన్ రిపోర్ట్ చూసుకొని చాలా హ్యాపీగా థాంక్యూ రాజు మా సినిమా బాగా రిలీజ్ చేసి పెట్టావ్ అన్నారు.. మళ్ళీ ఇప్పడు మహేష్ కోనేరు వచ్చి వెంకటేశ్వర స్వామి ఫోటో ఇచ్చి హ్యాపీగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి వి చూసినప్పుడు లైఫ్ లో కొన్ని మెమరీస్ గా మిగిలిపోతాయి. ఈ టీమ్ అందరికీ కంగ్రాట్స్ అన్నారు.

దర్శకుడు కె.వి.గుహన్ మాట్లాడుతూ... ఈ సినిమాని హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. అన్ని ఏరియాలనుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి మాసివ్ ప్రమోషన్స్ చేశారు.. మహేష్ కోనేరు. బడ్జెట్ కి వెనకాడకుండా సినిమాని క్వాలిటితో నిర్మించారు. స్క్రిప్ట్ నమ్మి నా మీద నమ్మకంతో ఈ సినిమా చేసిన కల్యాణ్ రామ్ కి థాంక్స్.. అన్నారు. 

సాంబశివరావు కోనేరు మాట్లాడుతూ... మా పెద్దబాబు శ్రీ మహేష్ 118తో సక్సెస్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. హీరో  కళ్యాణ్ రామ్, హీరోయిన్స్ అందరూ సపోర్ట్ చేసి ఈ హిట్ కి కారణమయ్యారు. ఇలాంటి మంచి హిట్ చిత్రాలు మహేష్ మరిన్ని నిర్మించాలి అన్నారు.

హీరోయిన్ షాలిని పాండే మాట్లాడుతూ.. బ్యూటిఫుల్ స్క్రిప్ట్. కొత్తదనం ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేశారు. మహేష్ వెరీ నైస్ ప్రొడ్యూసర్. గుహన్ ఫెంటాస్టిక్ గా తెరకెక్కించారు.. అన్నారు.

నివేత థామస్ మాట్లాడుతూ... హైదరాబాద్ లో ఈ సినిమా చూసాను. ఆడియెన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. చెన్నైలో మా ఫ్రెండ్స్ అందరూ సినిమాని అప్రిషియేట్ చేశారు. మౌత్ టాక్ డే బై డే పెరుగుతుంది. గుహన్ ఫస్ట్ ఫిలిం అయినా బాగా చేశారు. ఇలాంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు మహేష్ మరిన్ని తీయాలి..అన్నారు.

హీరో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ... మా  టీమ్ అంతా కష్టపడి సినిమాని నమ్మి చేశారు. మహేష్ మంచి డేట్ లో రిలీజ్ చేశారు. నివేత ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చేశారు. అలాగే చిన్న క్యారెక్టర్ అయినా యాక్సెప్ట్ చేసి చేసిన షాలిని కి థాంక్స్. శేఖర్ చంద్ర మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యింది. నా నువ్వే ప్లాప్ అయ్యాకా మహేష్ చాలా బాధ పడ్డాడు. అయినా నిరు త్సాహపడకుండా మళ్లీ నాతో ఈ సినిమా తీసి హిట్ కొట్టాడు. గుహన్ కథ చెప్పినప్పుడు భయం వేసింది. అయినా కొత్త జోనర్లో సినిమా చేస్తున్నాం అని కాన్ఫిడెంట్ గా చేసాం. ఈ 118 సక్సెస్ ని మా నాన్న గార్కి అంకితమిస్తున్నాం... అన్నారు.

Kalyan Ram Speak about 118 Success Meet:

118 Movie Success Celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs