Advertisement
Google Ads BL

పందెంకోడి నిశ్చితార్థం ఈ రోజే!


గ‌త కొంత కాలంగా పెళ్లంటే దాటేస్తూ వ‌స్తున్న పందెంకోడి విశాల్ ఇటీవ‌ల హైద‌రాబాదీ అమ్మాయి, పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి చిత్రాల‌ ఫేమ్ అనీషాని వివాహం చేసుకోబోతున్న విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్‌కు చెందిన పారిశ్ర‌మిక వేత్త కుటుంబానికి చెందిన అనీషాని ఓ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో తొలి చూపులోనే ప్రేమించిన విశాల్ ఆ త‌రువాత ఆ ప్రేమ‌ని పెళ్లిదాకా తీసుకొచ్చాడు. గ‌త కొంత కాలంగా స‌హ‌న‌టి వ‌ర‌ల‌క్ష్మితో ప్రేమ‌లో వున్నాడ‌ని జ‌రిగిన ప్ర‌చారానికి బ్రేకిచ్చిన విశాల్ అనూహ్యంగా అనీషాను ప్రేమించ‌డం, పెళ్లిదాకా తీసుకురావ‌డం ఎవ్వ‌రికీ అంతుచిక్క‌డం లేదు. 

Advertisement
CJ Advs

అయితే వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ ఈ రోజు( శ‌నివారం) హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ కార్య‌క్ర‌మానికి ఇరు కుటుంబాల వాళ్లు ఎలాంటి హంగామా చేయ‌డం లేదు. ఇరుకుటుంబాల‌కు సంబంధించిన అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశార‌ట‌. నిరాడంబ‌రంగా జ‌రుగుతున్న ఈ ఫ్యామిలీ ఫంక్ష‌న్‌లోనే పెళ్లి తేదీని కూడా ఫిక్స్ చేయ‌బోతున్నార‌ట‌. వివాహం కూడా హైద‌రాబాద్‌లోనే నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. రిసెప్ష‌న్ మాత్రం చెన్నైలో భారీ స్థాయిలో జ‌ర‌పాల‌ని ఏర్పాట్లే చేస్తున్నార‌ట‌. విశాల్ ప్ర‌స్తుతం `టెంప‌ర్‌` ఆధారంగా రూపొందుతున్న `అయోగ్య‌`లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  

vishal and anisha alla engagement tody:

vishal and anisha alla engagement tody in hyderabad
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs