Advertisement
Google Ads BL

టాలీవుడ్‌లో మొదటి స్థానం మహేష్‌దే!


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను నిర్మిస్తున్న ప్రొడ్యూసర్స్ బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈసినిమా మే 9 న విడుదల అవుతుంది. ఈసినిమా తరువాత మహేష్ తన 26 వ సినిమాను కూడా లైన్ లో పెట్టేసాడు.

Advertisement
CJ Advs

మహేష్ 26 వ సినిమా సుకుమార్ చేయాలి కానీ కొన్ని కారణాలు వల్ల అనిల్ రావిపూడి చేస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు తో పాటు అనిల్ సుంకర నిర్మించనున్నారు. మహర్షి తర్వాత దిల్ రాజు తెలివిగా మహేష్ ని లాక్ చేశారన్న మాట ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తోంది.

ఇక ఇది పక్కన పెడితే మహేష్ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే - మరోవైపు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించేస్తున్నారు. ప్రఖ్యాత కోలా బ్రాండ్ కి మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ బ్రాండ్ షూట్ కోసం మహేష్ రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా వెళ్లారు. అక్కడ అడవుల్లో - అరుదైన లొకేషన్లలో ఈ ప్రకటనను చిత్రీకరిస్తున్నారట. అలా సినిమాలతో బిజీగా ఉంటూనే మరొపక్కన ప్రకటనలతో భారీగా ఆర్జించే టాలీవుడ్ స్టార్ గా మహేష్ పేరు అగ్రపథంలో నిలుస్తోంది. మహేష్ ఏడాది 30 నుండి 40 కోట్లు వార్షికాదాయంతో ఫోర్బ్స్ జాబితాలోనూ ఆయన పేరు నిలిచింది. అలా టాలీవుడ్ లోనే మొదటి స్థానంలో నిలిచాడు.

Super Star Mahesh Babu in Top List:

Mahesh 1st place in forbes list from tolywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs