Advertisement
Google Ads BL

2019 - 2020 సినీ ప్రియులకు పండగే..!


2019 - 2020లో ఇండియాలో క్రేజీ మల్టీస్టారర్ ఏమిటి అంటే ఆర్.ఆర్.ఆర్ - కళాంక్ - బ్రహ్మాస్త్ర - మరక్కర్. ఈ సినిమాలు గురించి ప్రస్తుతం ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR చిత్రం ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 400 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కావడం విశేషం.

Advertisement
CJ Advs

ఇక భారీ బడ్జెట్ల చిత్రాలు విషయానికి వస్తే సైరా నరసింహారెడ్డి - సాహో - కళాంక్ - బ్రహ్మాస్త్ర - మరక్కర్ (మలయాళం) చిత్రాల పేర్లు మార్మోగిపోతున్నాయి. తెలుగులో చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం ను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో  రామ్ చరణ్ నిర్మిస్తున్న ‘సైరా- నరసింహారెడ్డి’ దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోందన్న సమాచారం ఉంది. హిస్టారికల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అమితాబ్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ నటించడం విశేషం. ఈ సినిమా ఆగస్టు లేదా అక్టోబర్‌లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. అలానే ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం దాదాపు 225 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సౌత్ లో ఈ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. 

ఇక హిందీలో మరో రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. బిగ్ బి అమితాబ్ బచ్చన్ - రణబీర్ కపూర్ - ఆలియాభట్ - నాగార్జున వంటి భారీ తారాగణంతో  బ్రహ్మాస్త్ర చిత్రానికి దాదాపు 150 కోట్ల బడ్జెట్ ని కేటాయించారు. కరణ్ జోహార్ నేతృత్వoలోని మరో భారీ ఫిక్షన్ చిత్రం బ్రహ్మాస్త్ర లోనూ ఆలియా కథానాయికగా నటిస్తోంది. 2020 లో ఈసినిమా విడుదల కానుంది.అలానే కరణ్ జోహార్ నిర్మాతగా మరో భారీ మల్టీ స్టార్రర్ ‘కళాంక్’ అనే సినిమాలో సంజయ్ దత్ - మాధురి ధీక్షిత్ - సోనాక్షి సిన్హా - ఆలియాభట్ - వరుణ్ ధావన్ - ఆదిత్య రాయ్ కపూర్ తారాగణంగా అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో నిర్మితం అవుతుంది. దీనికి దాదాపు 80- 100కోట్ల బడ్జెట్ అవ్వవచ్చని చెబుతున్నారు. ఏప్రిల్ 17న రిలీజవుతోంది.

అలానే మలయాళంలో దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో మోహన్ లాల్- నాగార్జున- సునీల్ శెట్టి- అర్జున్ షార్జా- సిద్ధిఖి- ప్రభుదేవా- సుదీప్ వంటి భారీ స్టార్లతో తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘మరక్కర్’ సినిమా 2020లో రిలీజ్ కానుంది. సో ఇలా ఎటు చూసినా ఏ ఇండస్ట్రీ చూసినా భారీ బడ్జెట్స్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. సో 2019 - 2020 సినీ లవర్స్ కి స్పెషల్ ఇయర్స్ కానున్నాయి.

Good News to Cine Lovers:

2019-20 big budget and crazy Projects 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs