Advertisement
Google Ads BL

వర్మ ప్లాన్ చేస్తే.. ఎవ్వడైనా వంగాల్సిందే!


రామ్ గోపాల వర్మ... ఇప్పుడు ఈ పేరు రెండు రాష్ట్రాల్లో ఎన్నికల వేడికన్నా ఎక్కువగా హాట్ హాట్ గా నానుతున్న పేరు. ఏపీ ఎన్నికల్లో టికెట్స్ రాక... కినుకు వహించి.. పార్టీలు వీడి మరో పార్టీకి జై కొడుతుంటే... టికెట్ వచ్చిన వారు గెలుపు మీద దృష్టి పెడుతుంటే.... మీడియా వారిని కవర్ చేసేందుకు నానా తిప్పలు పడుతుంది. కానీ వర్మ మాత్రం తానెలా ప్లాన్ చేసుకుంటున్నాడో అలానే మీడియాని వాడుకుంటున్నాడు. వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రేపు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో.. క్లారిటీ లేదు. అయినా తన సినిమాని ఎలాగైనా విడుదల చేస్తాను.. ఆపే దమ్ము ఎవరికి ఏందో చూస్తా అంటూ సవాళ్లు విసురుతున్నాడు. మరోపక్క ఈసీ దగ్గరికి టిడిపి కార్యకర్త లక్ష్మీస్ ఎన్టీఆర్ ని నిలిపి వేయాలంటూ వెళ్ళాడు. మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కష్టమంటూ మీడియాలో వార్తలు రావడంతో వర్మ ఎలెర్ట్ అయినట్లుగా కనబడుతుంది. 

Advertisement
CJ Advs

అందుకే తన సినిమాని ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లి.. టిడిపిని, చంద్రబాబుని, నందమూరి ఫ్యామిలీని హోల్ సేల్ గా ఇరికించెయ్యాలని చూస్తున్నాడు. అందుకే కంకణం కట్టుకుని మరీ లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో పక్కా వ్యూహాలతో ముందుకెళుతున్నాడు.  అందులో భాగంగానే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ చేసి పారేసాడు. అధికారికంగా ట్రైలర్ ద్వారా విడుదల చేసిన కొన్ని సన్నివేశాలు కాకుండా సినిమా నుండి కొన్ని కీలక సీన్లు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో అత్యంత కీలకంగా చెప్పుకునే వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ తాలుకు 6 నిమిషాల కీలక సన్నివేశాలు లీక్ చేశారు. 

అయితే ఈ వీడియోను ఎవరు లీక్ చేశారు అనే విషయంపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. కాకపోతే ఇది రామ్ గోపాల్ వర్మే కావాలనే లీక్ చేసి ప్రమోషన్ల పేరుతో తన సినిమాను హైలెట్ చేయడానికి ఇదంతా చేస్తున్నాడనిపిస్తుంది. ఒకవేళ ఈసీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఆపితే.. ఇలా కొన్ని కీలక సీన్స్ వదిలేస్తే.. ఆటోమాటిక్ గా టిడిపికి, చంద్రబాబుకి పెద్ద దెబ్బే. చూద్దాం వర్మ ప్లాన్స్ లో టిడిపి ఎంతగా ఇరుక్కుంటుందో అనేది.

Varma Released Lakshmis NTR Scenes in Social Media:

Ram Gopal Varma New Sketch for Lakshmis NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs