Advertisement
Google Ads BL

భారీ బడ్జెట్ అంటే బాలీవుడ్డోళ్లు ఉండాల్సిందేనా?


ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజున్న హీరోయిన్స్ ని వేళ్ళమీద లెక్కపెట్టడానికి కూడా కనిపించడం లేదు. అందుకే స్టార్ హీరోలందరికీ ఏకైక  ఆప్షన్ గా పూజ హెగ్డే కనబడుతుంది. అందుకే జక్కన్న కూడా తన RRR కోసం పర భాషా హీరోయిన్ ని తీసుకున్నాడు. అందులోను RRR పది భాషల్లో విడుదలవుతుంది కాబట్టి... బాలీవుడ్ భామ అయితేనే వర్కౌట్ అవుతుందని జక్కన్నకి తెలియదా.. అందుకే తన RRR లో రామ్ చరణ్ కోసం బాలీవుడ్ చిన్నది అలియా భట్ ని తీసుకొచ్చాడు. మరి ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ హీరోయిన్ అన్నాడు. మరామె ఎవరికీ పరిచయం కూడా లేని పేరు కాబట్టి.. అంతగా క్రేజ్ అనిపించడం లేదు. ఇప్పుడు  అందరి కళ్ళు అలియా భట్ మీదే ఉన్నాయి. బాలీవుడ్ లో చిన్న వయసులోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా చేతినిండా సినిమాలతో  బిజీగా ఉండి కూడా రాజమౌళి అడిగాడని.. RRR కోసం వచ్చేసింది అలియా. మరి నేషనల్ వైడ్ గా సినిమా అంటే ఆ మాత్రం క్రేజున్న హీరోయిన్ ఉండాల్సిందే. అందుకే రాజమౌళి టాలీవుడ్ హీరోయిన్స్ ని కానీ, కోలీవుడ్ హీరోయిన్స్ ని కానీ, శాండిల్ వుడ్, మల్లువుడ్ హీరోయిన్స్ జోలికెళ్ళలేదు.

Advertisement
CJ Advs

ఇక ఇప్పటికే మరో భారీ బడ్జెట్ మూవీ ద్వారా మరో బాలీవుడ్ హీరోయిన్స్ ఎప్పుడో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్ తో నేషనల్ వైడ్ గా తెరకెక్కుతున్న సాహో సినిమాతో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ద కపూర్ కూడా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మరి 350 నుండి 400 కోట్ల భారీ బడ్జెట్ తో RRR తో అలియా భట్ టాలీవుడ్ కి దూసుకొస్తే... 250 నుండి 300 కోట్ల బడ్జెట్ తో శ్రద్ద కపూర్ కూడా దూసుకొచ్చింది. మరి భారీ బడ్జెట్ మూవీస్ అంటే... వారికి ఏకైక ఆప్షన్ బాలీవుడ్ హీరోయిన్స్ అనేలా ఉంది.. ప్రస్తుతం టాలీవుడ్ వ్యవహారం. ఒకప్పుడు వెంకటేష్ బాలీవుడ్ హీరోయిన్స్ తో చాలాసార్లు రొమాన్స్ చేసాడు. ఇక మహేష్ బాబు కూడా బాలీవుడ్ హీరోయిన్స్ తో ఆడిపాడారు. కానీ అప్పట్లో అంతగా ఫోకస్ అవని బాలీవుడ్ భామలు ఇప్పుడు మాత్రం టాలీవుడ్ ని ఏలడానికి రెడీ అవుతున్నారు. మరి అలియా భట్ పేరుని ఇంతగా ముచ్చటించుకుంటే.. ఎన్టీఆర్ భామ హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ గురించి ఎప్పుడు ఇంతగా హాట్ హాట్ న్యూస్ లు వస్తాయో.. అయినా ఎన్టీఆర్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ పేరు పలకడానికి కూడా నందమూరి ఫ్యాన్స్ తడబడాల్సి వస్తుందేమో... అలా వుంది ఆ హాలీవుడ్ హీరోయిన్ పేరు.

Bollywood Actors for Tollywood Big Budget Films:

Shraddha Kapoor and Alia Bhatt in Tollywood Big Budget Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs