Advertisement
Google Ads BL

ఆకాష్‌పూరీ చిత్రానికి స్పెషల్‌ అట్రాక్షన్‌!


ప్రస్తుత జనరేషన్‌కి తెలియకపోవచ్చు గానీ దూరదర్శన్‌ నుంచి అనేక టివీ సీరియల్స్‌లో, పలు షోలకు హోస్ట్‌గా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్న నటి మందిరాబేడీ. ఈమె నాడు క్రికెట్‌ మ్యాచ్‌లకు హోస్ట్‌గా కూడా చేసి మెప్పించింది. తమిళంలో శింబు దర్శకత్వంలో ఆయనే నటించిన ‘మన్మథ’ చిత్రంలో హాట్‌హాట్‌గా కనిపించింది. ఇదే చిత్రం తెలుగులో కూడా అనువాదమై ఆమెకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈమె ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న బహుభాషా భారీ బడ్జెట్‌ చిత్రం ‘సాహో’లో కీలకపాత్రను పోషిస్తోంది. ఇదే సమయంలో ఈమె మరో సినిమాకి కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. 

Advertisement
CJ Advs

‘ఆంధ్రాపోరి’తో ఎంట్రీ ఇచ్చి బాలనటునిగా ఎన్నోచిత్రాలలో నటించిన డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌పూరీ ఆ మధ్య తన తండ్రి దర్శకత్వంలోనే ‘మెహబూబా’ చిత్రం చేశాడు. ఈ చిత్రం పెద్దగా విజయం సాధించలేదు. తాజాగా ఆకాష్‌పూరీ ‘రొమాంటిక్‌’ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. పూరీ జగన్నాథ్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రం ద్వారా అనిల్‌ పాడూరి దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. ప్రసుత్తం ‘రొమాంటిక్‌’ చిత్రం షూటింగ్‌ గోవాలో జరుగుతోంది. ఇందులో మందిరా బేడీ ఓ నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనుందట. 

తాజాగా ఆమె గోవాలో ఈ చిత్రం యూనిట్‌తో జాయిన్‌ అయిందని సమాచారం. ఇక ఇందులో ఆకాష్‌పూరీ సరసన ఢిల్లీ మోడల్‌ కేతికశర్మ నటిస్తోంది. ఆకాష్‌పూరీ ‘మెహబూబా’ చిత్రం ఫ్లాప్‌ అయినా కూడా తన లుక్స్‌, నటనతో మంచి మార్కులే కొట్టేశాడు. మరోవైపు పూరీ ఎందరో హీరోలకే హిట్స్‌ ఇచ్చినా తన సోదరుడు సాయిరాం శంకర్‌కి, కుమారుడు ఆకాష్‌పూరీకి హిట్స్‌ ఇవ్వడంలో విఫలమయ్యాడు. మరి ‘రొమాంటిక్‌’ చిత్రం అయినా ఆకాష్‌పూరీకి హిట్‌ని అందిస్తుందో లేదో వేచిచూడాలి...! 

Special Attraction in Akash Puri Movie:

Mandira Bedi in Akash Puri Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs