Advertisement
Google Ads BL

ఎన్టీఆర్, చరణ్- ప్రణతి, ఉప్సీ.. ఫ్రేమ్ అదిరింది


ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ స్నేహం.. చూసి అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ ఇలా అంతా స్నేహితుల్లా మెలగడం అభిమానులకే కాదు.. సాధారణ ప్రేక్షకుడికి కూడా కన్నుల పండగే. ఇక ప్రస్తుతం RRR తో రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబో తెర మీదకెక్కుతుంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల RRR వచ్చే ఏడాది జులై 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ కాంబో మీద భారీ అంచనాలే ఉన్నాయి. అయితే నిన్న జరిగిన RRR ప్రెస్ మీట్ లో ఈ సినిమా నాతో కలిసి నటించడానికి ఒప్పుకున్న చరణ్ కి హ్యాట్సాఫ్ చెప్పాలని తారక్ అంటే... నాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న తారక్ కి థాంక్స్ అంటూ ఇద్దరూ స్నేహ ధర్మాన్ని చాటుకోవడమే కాదు.. తారక్ అయితే.. నవ్వుతూ మా స్నేహానికి దిష్టి తగులుతుందేమో? మేము చివరిదాకా మా స్నేహాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నామని చెప్పాడు.

Advertisement
CJ Advs

మరి ఈ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఫ్రెండ్షిప్ తెర మీద చూడడానికి రెండు కళ్ళు చాలవేమో.. అంటే నిజంగానే తారక్ చెప్పినట్టుగా దిష్టి తగిలేస్తుందేమో? అందుకే చరణ్ భార్య ఉపాసన, ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతిలు కూడా తమ స్నేహాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఎప్పటినుండో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు భార్యలతో కలిసి మరీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారిపోయారు. తాజాగా భర్తలు RRR  ప్రెస్ మీట్ కోసం తయారై వస్తే.... భార్యలు ఉపాసన, లక్ష్మి ప్రణతి కూడా అందమైన డ్రెస్సులతో కలిసి ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరి ఎన్టీఆర్, చరణ్ స్నేహమే కాదు.. ఉపాసన, లక్ష్మి ప్రణతీల స్నేహమూ చూడ ముచ్చటగానే ఉంది. మరి ఇప్పుడిప్పుడే సెట్స్ మీదకెళ్ళిన RRR సినిమా మొదట్లోనే ఇలాంటి సెన్సేషనల్ ఫొటోస్ బయటికొస్తుంటే... సినిమా పూర్తయ్యి విడుదలయ్యే సమయానికి ఇంకెన్ని ఇంట్రెస్టింగ్ కాంబో పిక్స్ బయటికొస్తాయో కానీ.... ప్రస్తుతం అయితే నందమూరి, మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.

Friendship Between Mega and Nandamuri families Revealied:

Photo: Jr NTR and Charan, Pranathi and Upasana Friendship
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs