Advertisement
Google Ads BL

‘మా’ నూతన అధ్యక్షుడికి ప్రముఖుల ఆశీస్సులు


సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల దంపతుల ఆశీర్వాదాలు తీసుకున్న మా అసోసియేషన్ అధ్యక్షుడు వీకే నరేష్ ప్యానెల్..!!

Advertisement
CJ Advs

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కొత్త అధ్యక్షుడిగా నటుడు వీకే (సీనియర్) నరేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమైన పదవులకు నరేష్ ప్యానల్ తరపున పోటీచేసిన సభ్యుల్లో ఎక్కువమంది విజయం సాధించగా..  ప్రధాన కార్యదర్శిగా జీవిత రాజశేఖర్‌, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా రాజశేఖర్‌, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, కోశాధికారిగా రాజీవ్‌ కనకాల, సంయుక్త కార్యదర్శిగా గౌతమ్‌రాజు, శివబాలాజీ విజయం సాధించారు. 

కాగా మా ఎన్నికలలో గెలుపొందిన వీకే నరేష్ ప్యానెల్ ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల దంపతుల ఆశీస్సులు తీసుకున్నారు. మర్యాదపూర్వకంగా కలిసిన నరేష్ ప్యానెల్ సభ్యులు  సూపర్ స్టార్ కృష్ణ గారితో కాసేపు ముచ్చటించి బాగోగులు తెలుసుకున్నారు. ఆ తర్వాత రెబల్ స్టార్ కృష్ణంరాజు గారిని గౌరవపూర్వకంగా కలిశారు. మాకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చి ఇంత ఘన విజయం పొందేందుకు సహకరించినందుకు మా అధ్యక్షుడు నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. 

ఆ తర్వాత సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన అంతే మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకుని ఆయన పలు హామీలు ఇచ్చారు. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేనుంటాను, ‘మా’ అభివృద్ధికి , కళాకారుల బాగోగులు చూసుకునేలా అన్ని విధాలా సహకరిస్తాను అని అయన హామీ ఇచ్చారు. నరేష్ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

MAA President Naresh Takes Blessings From Krishna, Krishnam Raju and Talasani:

Maa new team meet Krishna, Krishnam Raju and Talasani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs