Advertisement
Google Ads BL

మోదీని ఇరుకున పెట్టే సత్తా ఆమెకి ఉందా?


ఏ రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ స్థానాలు ఉంటాయో అవి కేంద్రంలో లోక్‌సభ అభ్యర్ధుల విషయంలో కీలకపాత్రను పోషిస్తాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విషయంలో ఎన్టీయే, యూపీఏలలో ఏపీ కీలకపాత్రను పోషించింది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపీల సంఖ్య తగ్గిపోవడంతో ఏపీ ప్రాధాన్యం కేంద్రంలో పెద్దగా ఉండటం లేదు. రాష్ట్రం విడిపోవడం వల్ల వచ్చిన చిక్కు ఇది. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. దేశంలో అత్యధిక ఎంపీలు ఉన్న రాష్ట్రాలో 80సీట్లు ఉన్న యూపీ తర్వాత 42 స్థానాలతో పశ్చిమబెంగాల్‌ రెండో స్థానంలో ఉంది. ఏ పార్టీకి మెజార్టీ రాదని, బొటాబొటీగా బిజెపి, కాంగ్రెస్‌, మూడో ఫ్రంట్‌లకి సీట్లు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఏర్పాటులోనే కాదు.. ప్రభుత్వాన్ని నిలపాలన్నా, ఇరుకున పెట్టాలన్నా తృణముల్‌ కాంగ్రెస్‌ కీలకంగా మారనుంది. మొదటి నుంచి మోదీకి వ్యతిరేకంగా ఉన్న తృణమూల్‌ ఈ మధ్య శారదా చిట్‌ఫండ్స్‌ విషయంలో తమ పోలీస్‌ కమిషనర్‌ కోసం మోదీతో ఢీ కొట్టి, సిబిఐని ముప్పతిప్పలు పెట్టి, చివరకు సుప్రీంజోక్యంతో మమతా బెనర్జీ కాస్త మౌనంగా ఉంది. 

తాజాగా ఆమె మరోసారి మోదీని టార్గెట్‌ చేసింది. పశ్చిమ బెంగాల్‌ని నాశనం చేయడానికి మోదీ కంకణం కట్టుకున్నారు. 2014లో పాలేగే విడతలో కల పోలింగ్‌ని వద్దని చెప్పిన మోదీ ఈసారి ఏకంగా ఏడు విడతల్లో ఎన్నికల నిర్వహణ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు.? వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మోదీని గద్దె దింపుతాం. గత ఎన్నికల్లో 42కి గాను 34స్థానాలలో విజయం సాధించాం. ఈసారి క్లీన్‌స్వీప్‌ చేసే రాబోయే కేంద్రప్రభుత్వంలో మనమే కీలకం... అని చెప్పుకొచ్చింది. అయతే రాబోయే ఎన్నికల్లో ఆమె మూడో ఫ్రంట్‌లో ఉంటుందా? లేక కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తుందా? అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 

Narendra Modi vs Mamata Banerjee:

Mamata Banerjee Targets Modi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs