Advertisement
Google Ads BL

RRRకు బడ్జెట్ ఎంతో తెలుసా?


ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు.. అన్ని భాషల్లోనూ హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే.. అది RRR సినిమా గురించే. రాజమౌళి గత చిత్రం బాహుబలితో రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ RRR పై ట్రేడ్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టాలీవుడ్ నిర్మాత దానయ్య భారీ బడ్జెట్ తో RRR సినిమాని ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. అయితే భారీ బడ్జెట్ అన్నారు కానీ.. RRR బడ్జెట్ మీద ఇప్పటివరకు మీడియాకి క్లారిటీ లేదు. 200 నుండి మూడొందల కోట్ల బడ్జెట్ తో RRR నిర్మితమవుతుంది అని అన్నారు కానీ.. క్లారిటీ లేదు.

Advertisement
CJ Advs

మరి నేషనల్ వైడ్ గా పలు భాషల్లో తెరకెక్కుతున్న RRR బడ్జెట్ పై.. ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఒక స్పష్టత వచ్చేసింది. రాజమౌళి RRR సినిమాని హై టెక్నికల్ వ్యాల్యూస్ తో 350 కోట్ల నుండి 400కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నామని.. ఆ సినిమా నిర్మాత దానయ్య తెలియజేశాడు. ఇక ఈ సినిమాని అనేక భాషల్లో విడుదల చెయ్యమని RRR బృందము మీద ఒత్తిడి ఉందని కానీ.. ప్రస్తుతం తెలుగు, తమిళ్,  హిందీ, కన్నడ, మలయాళం ఇలా మొత్తం 10 బాషల్లోకి RRR విడుదల చేసేందుకు నిర్ణయించామని రాజమౌళి ఈ ప్రెస్ మీట్ లో తెలిపాడు.

మరి బహు భారీ బడ్జెట్ తో ఈ RRR సినిమా తెరకెక్కిస్తున్నారు అనగానే ఎన్టీఆర్ అండ్ మెగా ఫ్యాన్స్ అందరూ సంబర పడిపోతున్నారు. తమ అభిమాన హీరోలు ఈ భారీ సినిమాతో నేషనల్ వైడ్ గా ఫోకస్ అవుతారని వారు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మరి తెలుగులో ఈ రేంజ్ బడ్జెట్ తో ఇప్పటివరకు ఏ సినిమా కూడా తెరకెక్కలేదు. మరి తెలుగులో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న మొదటి చిత్రం ఈ RRR కావడం తెలుగు ప్రేక్షకుల అదృష్టమే.

Shocking Budget to RRR Movie:

DVV Danayya Reveales RRR Movie Budget
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs