Advertisement
Google Ads BL

సమంతపై మళ్లీ వేసుకున్నారు..!


టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడమే భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన సమంత... ఇప్పుడు అక్కినేని వారి కోడలిగా ఒక వెలుగు వెలుగుతుంది. ఒకపక్క సంసారం, మరోపక్క కెరీర్ రెండూ మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది. తాజాగా భర్తతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న మజిలీ సినిమా ఏప్రిల్ 5 న విడుదలకు సిద్ధమవుతుండగా.. నందిని రెడ్డి సినిమా ఒకటి, దిల్ రాజు 96 రీమేక్ ఒకటి లైన్ లో ఉన్నాయి. ఇక మరోపక్క కొన్ని వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్ గాను.. అలాగే కొన్ని ప్రొడక్ట్స్ కి సంబందించిన యాడ్స్ లోను నటిస్తూ సమంత రెండు చేతులా సంపాదిస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. 

Advertisement
CJ Advs

తాజాగా సమంత చిన్నపిల్లలకు చాలా ఇష్టమైన కుర్ కురే ప్రొడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్నట్లుగా చెప్పడమే కాదు.. అప్పుడే సమంత కుర్ కురే యాడ్ లో నటించింది. ప్రస్తుతం సమంత కుర్ కురే యాడ్ టివి ఛానల్స్ లో పదే పదే ప్రసారమవుతుంది. తాజాగా సమంత నటించిన కుర్ కురే యాడ్ మీద నెటిజెన్స్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సమంతని ట్రోల్ చేస్తున్నారు. కుర్ కురే చిన్న పిల్లలకు అత్యంత ప్రీతికరమైన స్నాక్ ఐటెం. కానీ కుర్ కురే లో ప్లాస్టిక్ పదార్ధాలు కలవడంతో.. అవి చిన్న పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తాయనే న్యూస్ ఎప్పటినుండో వినబడుతుంది. 

పిల్లల ఆరోగ్యానికి హానికరమైన ఇలాంటి ప్రొడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎలా వ్యవహరిస్తారు అంటూ.. సమంత మీద కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాదు...  సమంతకు ట్వీట్స్ పెడుతున్నారు. డబ్బు కోసం ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తావా.. దయచేసి చెయ్యొద్దు అంటూ... ట్వీట్స్ చేస్తున్నారు. మరి నెటిజెన్ల కామెంట్స్ ని సమంత పట్టించుకుంటుందో.. లేదంటే నాకెందుకులే అని వదిలేస్తుందో చూద్దాం. 

Netizens Fires on Samantha:

Samantha Brand Ambassador for Kurkure
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs