Advertisement
Google Ads BL

చిత్రలహరి టీజర్: ఏదైనా సరే ఆదివారమే..!


వరస ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు చిత్రలహరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. భారీ డిజాస్టర్స్ తో ఉన్న ఈ హీరో.. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి సినిమా చేసాడు. ఏప్రిల్ 12 విడుదల అంటూ చిత్రలహరి ప్రమోషన్స్ ని వెరైటీగా మొదలెట్టేసింది చిత్రలహరి టీం. నిన్న మంగళవారం.. చిత్రలహరి పాత్రల పరిచయం అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల చేసిన టీం.. నేడు చిత్రలహరి టీజర్ ని విడుదల చేసింది. కళ్యాణి ప్రియదర్శినితో పాటు మరో హీరోయిన్ నివేత పేతురాజ్ కూడా ఈ సినిమాలో సాయి ధరమ్ పక్కన హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇక రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రలహరి టీజర్ లోకి వెళితే... అబ్బాయిలంటే.. సదభిప్రాయంలేని పాత్రలో నివేత పేతురాజ్ కనిపిస్తుంటే... అఖిల్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని మాత్రం.. కాస్త క్యూట్ గా నా గురించి నేను చెప్పాలంటే.. ఐ నీడ్ సమ్ టైమ్.. డిస్కస్ చేయాలి అంటూ ఆకట్టుకుంది. ఇక నాపేరు విజయ్.. నాపేరు లో ఉన్న విజయం.. నా జీవితంలో ఎప్పుడొస్తుందో.... అంటూ నిరాశతో మందు కొట్టే సీన్ లో కనబడుతుంటే.. విజయం కోసం మాట్లాడుతున్న సమయంలో పవర్ కట్ అవడం.. ఇక సాయి ధరమ్ ఫ్రెండ్ గా సుదర్శన్ బాధ పడకు బాబాయ్ నీకూ ఓ మంచిరోజొస్తుంది.. అంటే దానికి బదులుగా సాయి ధరమ్.. ఆ వచ్చేదేదో.. సన్ డే రమ్మను.. అప్పుడైతే ఖాళీగా వుంటాను అంటూ ఫన్నీగా చెప్పే డైలాగ్స్ బావున్నాయి. ఇక కమెడియన్ సునీల్ కాస్త ఇంట్రెస్టింగ్ పాత్రలో చిత్రలహరిలో దర్శనమిస్తున్నాడు.

మరి నాలుగు పాత్రల పరిచయాలతోనే ఆకట్టుకున్న చిత్రలహరి బృందం.. సినిమాతో ఏం అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి. గతంలో ప్రతి శుక్రవారం చిత్రలహరి అనే పాటల ప్రోగ్రాం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూండేవారు.  ఈ చిత్రలహరి టీజర్ చూసాక.. ఈ మోడరన్ ప్రేక్షకులు కూడా ఈ చిత్రలహరి సినిమా కోసం ఏప్రిల్ 12 వరకు ఇంట్రెస్టింగ్ గా వేచి చూడాల్సిందే. 

CLICK HERE FOR CHITRALAHARI TEASER:

Chitralahari Teaser Released:

Chitralahari Movie Teaser Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs