Advertisement
Google Ads BL

తేడా వస్తే.. తేజా అంతే.. తెలిసిందేగా..!


టాలీవుడ్‌ డైరెక్టర్స్ లో చాలామంది తాము అనుకున్నదే జరగాలనే మనస్తత్వంలో ఉంటారు. అందుకే కెరీర్ లో వాళ్ళు చాలా ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. అలాంటివాళ్లలో రామ్ గోపాల్ వర్మ, తేజలాంటి వాళ్లు ఉన్నారు. అయితే వర్మ ని చాలామందే చాలారోజుల క్రితమే పక్కన పెట్టేసారు. కానీ తేజ మాత్రం అందరికి సన్నిహితంగానే ఉంటున్నాడు. చాలా రోజులనుండి ఫామ్ కోల్పోయిన తేజ, రానా హీరోగా చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో ఫామ్ లోకి రావడం... తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ కి దర్శకుడిగా అనుకుని.. బాలయ్య తో కుదరక.. ఆ ప్రాజెక్ట్ నుండి తేజ బయటికొచ్చాక మీడియాలో చాలా రోజులవరకు హాట్ టాపిక్ అయ్యాడు. ఇక గతంలో కుర్ర హీరోలతో సినిమాలు చేసేటప్పుడు వాళ్ళని తేజ కొట్టాడు అనే టాక్ నడవడమే కాదు.. తమకి మంచి హిట్స్ ఇచ్చిన తేజను కుర్ర హీరోలు తర్వాత పట్టించుకున్న దాఖలాలు లేవు. అందులో నితిన్, మహేష్, గోపీచంద్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. 

Advertisement
CJ Advs

ఇక నేనే రాజు నేనే మంత్రి తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ కథ ముగిశాక బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తాను సినిమాల్లోకి తెచ్చిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో సీత అనే సినిమా చేస్తున్నాడు తేజ. షూటింగ్ చివరి దశలో ఉన్న సీత సినిమా ఏప్రిల్ 25 న విడుదల డేట్ ఫిక్స్ కూడా చేసుకుంది. మరి విడుదల డేట్ ఫిక్స్ అయ్యాక ఇప్పుడు ఈ సీత సినిమా విషయంలో ఒక న్యూస్ ఫిలింసర్కిల్స్ లోను, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయ్యింది. అదేమిటంటే సీత సినిమా సెట్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కి దర్శకుడు తేజకి చిన్నపాటి మనస్పర్థలు రావడంతో... తేజ ‘సీత’ సెట్స్ నుండి అలిగి వెళ్లిపోయాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.

అయితే తేజకి బెల్లంకొండ శ్రీనివాస్‌కి మధ్యన వచ్చిన విభేదాలకు కారణం గెడ్డం అంట. బెల్లంకొండని సీత సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం గెడ్డం పెంచమని తేజ కోరగా.. దానికి శ్రీనివాస్ నిరారించడంతో.. తేజ శ్రీనివాస్ మీద అలిగి సెట్స్ నుండి వాకవుట్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి షూటింగ్ చివరిలో ఉండగా.. ఇలాంటి విభేదాల వలన సినిమా విడుదలకు సమస్యలొస్తాయనుకుంటే.. అదేమీ లేదు.. తేజ షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేస్తానని సీత యూనిట్ కి మాటిచ్చినట్లుగా తెలుస్తుంది. 

Teja furious with Bellamkonda Srinivas:

Teja Shouted Furiously On Young Hero
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs