Advertisement
Google Ads BL

‘పులిజూదం’ ట్రైలర్ వదిలారు


‘పులిజూదం’ ట్రైలర్ ని విడుదల చేసిన ప్రముఖ నిర్మాత B.V.S.N.ప్రసాద్ 

Advertisement
CJ Advs

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, విశాల్, హన్సిక, రాశీ ఖన్నా, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ మల్టీస్టారర్ ‘పులిజూదం’. బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించిన మలయాళ సినిమాకు తెలుగు అనువాదమిది. తెలుగులో రవితేజ ‘పవర్’, ‘ఆటగదరా శివ’, తమిళంలో రజనీకాంత్ ‘లింగా’, హిందీలో సల్మాన్ ఖాన్ ‘భజరంగి భాయీజాన్’ సినిమాలు నిర్మించిన ప్రముఖ కన్నడ నిర్మాత ‘రాక్ లైన్’ వెంకటేష్ ఈ సినిమాను నిర్మించారు. తెలుగులోనూ ఆయనే విడుదల చేస్తున్నారు. ఈ నెల (మార్చి) 21న ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోందీ సినిమా. ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ తెలుగు నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మలయాళంలో విజయవంతమైన ఈ సినిమా తెలుగులోనూ విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. 

ఈ సందర్భంగా రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడుతూ.. ‘‘క్రైమ్ డ్రామా నేపథ్యంలో రూపొందిన భారీ మల్టీస్టారర్ సినిమా ఇది. ఏ పాత్ర ప్రత్యేకత ఆ పాత్రకు ఉంటుంది. తెలుగు హీరో శ్రీకాంత్ గారు ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించారు. అలాగే, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన మోహన్ లాల్, తెలుగువాడైన విశాల్, తెలుగు హీరోయిన్లు రాశీ ఖన్నా, హన్సిక ప్రధాన పాత్రల్లో నటించారు. పోలీస్ అధికారుల పాత్రల్లో మోహన్ లాల్, రాశీ ఖన్నా అద్భుతంగా నటించారు’’ అన్నారు. 

సిద్ధిఖీ, రెంజి పానికర్, వినోద్ జొస్, సాయికుమార్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

Puli Joodham Trailer Released:

Producer BVSN Prasad Releases Puli Joodham Trailer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs