Advertisement
Google Ads BL

లక్ష్మీస్ ఎన్టీఆర్: వర్మ ఆ పని చేస్తే.. బాబుకే రిస్క్!


టాలీవుడ్‌లో ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి అంతా చర్చ నడుస్తుంది. ఈ సినిమా వల్ల తమ నాయకుడు ఇమేజ్ దెబ్బ తింటుందని ఒకపక్క టిడిపి శ్రేణులు భయపడుతుండగా అదేమీ జరగదని మరి కొంతమంది చెబుతున్నారు. అప్పటిలో కృష్ణ బ్యాచ్ ఎన్టీఆర్ పై ఎన్ని సినిమాలు తీసినా అవి ఏమి ఆయనపై ఎఫెక్ట్ పడలేదని.. ఆయన రెండో సారి సిఏం అయ్యారని వాదించేవారు లేకపోలేదు.

Advertisement
CJ Advs

అయితే అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు టెక్నాలజీ కూడా పూర్తిగా మారిపోయింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండు ట్రైలర్లు కలిపి ఇప్పటికే ఐదు కోట్లకు పైగా వ్యూస్ తెచ్చుకోవడం కన్నా ప్రత్యక్ష ఉదాహరణ ఇంకేం కావాలి. అయితే వర్మ చెప్పినట్టు ఈచిత్రం ఈనెల 22 న విడుదల అవుతుందా లేదా అనేది భేతాళ ప్రశ్న.

ఈ సినిమాను ఎట్టి పరిస్థితిల్లో ఆపాలని నందమూరి ఫ్యామిలీ కోర్ట్ కి ఎక్కుతుందని ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సూచనలు ఏమి కనిపించడం లేదు. ఒకవేళ నిజంగానే నందమూరి ఫ్యామిలీ కోర్ట్ కి వెళ్లి స్టే తెచ్చినా.. వర్మ అన్నట్టు ఏ యుట్యూబ్ లోనో అమెజాన్ ప్రైమ్ లోనో నేరుగా వదిలాడంటే అంతే సంగతులు. థియేటర్స్ లో కంటే ఆన్ లైన్లోకి ఫ్రీగా వస్తుంది కాబట్టి ఇందులోనే ఎక్కువ మంది చూస్తారు. అప్పుడు నిజంగానే పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. ఏదిఏమైనా త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

RGV Challenge For Lakshmis NTR Release :

Big Risk to Chandrababu with Lakshmis NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs