Advertisement
Google Ads BL

నాని ‘జెర్సీ’ రిలీజ్ డిటైల్స్..!


నేచురల్ స్టార్ నాని, సితార ఎంటర్ టైన్మెంట్స్ ‘జెర్సీ’ ఏప్రిల్ 19 విడుదల 

Advertisement
CJ Advs

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ‘జెర్సీ’ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని విడుదలకు   సిద్దమవుతుంది.                                                                                                                     

ఈ మధ్యనే విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి అధ్బుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ..  ‘‘జెర్సీ చిత్రం నాకు సినిమాగానే కాకుండా నా హృదయానికి బాగా నచ్చిన, దగ్గరైన కథ. రేపు మీ అందరి హృదయాలలో కూడా చోటు సంపాదించుకుంటుంది అనుకుంటున్నాను, ఇది 36 సంవత్సరాల వయసులో తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే అర్జున్ అనే క్రికెటర్ కథ. జెర్సీ అని ఈ సినిమాకి టైటిల్ ఎందుకు పెట్టామో ఈ చిత్రం చూసిన తరువాత అందరికీ అర్థం అవుతుంది. అర్జున్ క్యారెక్టర్ లో ఒదిగిపోయి ఈ చిత్రం ఇంత సక్సెస్ ఫుల్ గా రావడానికి ముఖ్య కారణమైన నాని గారికి, అన్ని విధాలుగా సహకరించిన మా నిర్మాత నాగ వంశీ గారికి ధన్యవాదాలు..’’ అన్నారు. 

నిర్మాత మాట్లాడుతూ.. మా ‘జెర్సీ’ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం మా బేనర్ లో చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుందని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాధ్, సత్యరాజ్, రోనిత్ కమ్ర,రావు రమేష్, బ్రహ్మాజీ, శిశిర్ శర్మ, సంపత్, ప్రవీణ్ ప్రధాన తారాగణం.

సంగీతం: అనిరుద్ రవిచందర్, కెమెరా: సాను జాన్ వరుఘీస్ , ఆర్ట్: అవినాష్ కొల్ల, ఎడిటర్: నవీన్ నూలి, ఎగ్జి క్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకట్ రత్నం (వెంకట్), సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగ వంశి,

కధ-స్క్రీన్ ప్లే- మాటలు-దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి  

Nani Jersey Release Update:

Nani Jersey Release on April 19th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs