Advertisement
Google Ads BL

ఉగాది రోజున భయపెడుతుందట!


ఉగాది కానుక‌గా ఏప్రిల్ 6న ‘ప్రేమ‌క‌థాచిత్రమ్ 2’ గ్రాండ్ రిలీజ్ 

Advertisement
CJ Advs

ఆర్.పి.ఏ క్రియేష‌న్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి సార‌థ్యంలో తెర‌కెక్కుతున్న హార‌ర్ కామెడీ సినిమా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2. గ‌తంలో ఇదే బ్యాన‌ర్ లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి, హార‌ర్ కామెడీ సినిమాల‌కు తెలుగునాట ట్రెండ్ క్రియేట్ చేసిన ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ కు సీక్వెల్ గా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2 రెడీ అయింది. ఈ చిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యమౌతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిద్ధి ఇద్నాని జంట‌గా న‌టిస్తున్నారు. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌ డూప‌ర్ హిట్ చిత్రంలో త‌న పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. సూప‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మొద‌టి పార్ట్‌కి ధీటుగా వ‌స్తున్న ఈ చిత్రానికి నందిత శ్వేతా న‌ట‌న మరో ప్ల‌స్ అవుతుంది.  ‘ప్రేమకథాచిత్రమ్ 2’ చిత్రానికి మరో ఆకర్షణ రావు రమేష్. ఆయన నటనకే కాదు వాయిస్ కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం రావు రమేష్ వాయిస్ ఓవర్ తో నడుస్తుంది. తాజాగా విడులైన ఈ సినిమా ట్రైల‌ర్ కు సోష‌ల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ల‌భించింది. దాదాపు 6 ల‌క్ష‌ల వ్యూస్ ఈ ట్రైల‌ర్ కు ద‌క్కాయి. ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 6న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. దీనికి సీక్వెల్ గా వ‌స్తున్న ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2 ని కూడా అంతే క్రేజ్ తో రూపొందిస్తున్నాం. హిందీ శాటిలైట్, డ‌బ్బింగ్ రైట్స్ ని కోటి న‌ల‌భై మూడు ల‌క్ష‌ల‌కి కొనుగోలు చేశారు. ఇక ఈ చిత్రంలో నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సుమంత్ అశ్విన్ హీరోగా, సిధ్ధి ఇద్నాని మ‌రో హీరోయిన్ గా నటిస్తున్నారు. విధ్యుల్లేఖ‌, ప్ర‌భాస్ శ్రీను మ‌ధ్య వ‌చ్చే కామెడీ హిలేరియస్ గా ఉంటుంది. ప్రస్తుతం ప‌బ్లిసిటీ, త‌దిత‌ర‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 6న‌ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నాం. పూర్తి స‌ర్‌ప్రైజింగ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న మా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2 అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుందనే నమ్మకముంది’’ అని అన్నారు.

Premakatha Chitram 2 Release Date Fixed:

Premakatha Chitram 2 Movie release on Ugadi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs