Advertisement
Google Ads BL

మహేష్‌కు సుక్కు.. సారీ ఎందుకు చెప్పాడు?


మహేష్ - సుకుమార్ న్యూస్ గత వారం రోజుల నుండి ఏదో విధంగా మీడియాలో హాట్ టాపిక్ గానే నానుతుంది. మొన్నటివరకు మహేష్ - సుకుమార్ కథపై రకరకాల న్యూస్ లు వస్తే.. మొన్నటి నుండి.. సుకుమార్ - మహేష్ సినిమా బ్రేకప్ అవడంపై మీడియాకి బాగా మేత దొరికింది. మహేష్‌కి సుకుమార్‌కి మధ్య వచ్చిన డిఫ్రెన్సెస్ ని సుకుమార్ తెలివిగా అల్లు అర్జున్ తో సినిమా కమిట్ అయ్యి... బ్రేక్ వేస్తే.. మహేష్ మాత్రం హుందాగా సుకుమార్ తో తన సినిమా క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన ఆగిపోయిందని ట్వీట్ చేసాడు. 

Advertisement
CJ Advs

అయితే మహేష్ - సుకుమార్ సినిమా ఆగిపోయిన విషయంపై సుకుమార్ ఎక్కడా స్పందించలేదు. ఇక మీడియా మాత్రం కావాల్సిన వార్తలు కావాల్సినట్టుగా రాసుకుంది. అయితే ఈ సుకుమార్ - మహేష్ వ్యవహారంలో తల బొప్పికట్టింది మాత్రం ఒక్క మైత్రి మూవీస్ వారికే. మహేష్ తో సినిమాని సుకుమార్ మైత్రి వారికే చెయ్యాల్సింది. ఇప్పుడు మైత్రి వారు సుకుమార్ వలన మహేష్ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది.

అయితే ఇపుడు మైత్రి వారి కోసం మహేష్‌ని సుకుమార్ కలిసినట్లుగా ఒక వార్త టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు... మహేష్‌తో ఆగిపోయిన సినిమాపై స్పందించని సుకుమార్ ఇప్పుడు మహేష్ కోసం మహర్షి షూటింగ్ జరుగుతున్న ప్లేస్ కి వెళ్లి మరీ కలిసి మహేష్ తో మాట్లాడడము జరిగింది అంటున్నారు. మహేష్ తో సంప్రదించకుండా తాను అల్లు అర్జున్ తో సినిమా కమిట్ అవడంపై వివరణ ఇవ్వడమే కాకుండా మహేష్ కి సారీ కూడా చెప్పాడని టాక్ అయితే జోరుగా ప్రచారంలోకి వచ్చింది. అంతేకాకుండా సుకుమార్ ఓ రోజు మొత్తం మహేష్ తోనే గడిపాడట. అయితే మహేష్ నవ్వి లైట్ తీసుకోమని.... చెప్పడమే కాకుండా మిగతా విషయాలు కూడా సుకుమార్ తో ముచ్చటించాడని చెబుతున్నారు. 

అయితే సుకుమార్.. మహేష్ ని కలవడం వెనుక మైత్రి మూవీస్ వారు ఉన్నారని.. వారి ప్రోద్భలంతోనే సుకుమార్, మహేష్ ని కలిసొచ్చినట్లుగా చెబుతున్నారు. ఫ్యూచర్ లో మహేష్ - సుకుమార్ కలిసి సినిమా చెయ్యకపోయినా.. మైత్రి మూవీస్ వారికి మహేష్ తో సినిమా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తేడాలు రాకూడదనే ఉద్దేశ్యంతోనే సుకుమార్ కి మైత్రి వారు నచ్చజెప్పి మహేష్ వద్దకు పంపినట్లుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి.

Director Sukumar asks apologies to Super Star Mahesh Babu:

Sukumar Meets Mahesh for Mythri Movie Makers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs