Advertisement
Google Ads BL

తెలుగులో ఐరన్ లెగ్.. బాలీవుడ్ లక్కీ గాళ్!


తెలుగులో మంచు మనోజ్‌తో కలిసి ఝమ్మంది నాదం సినిమాతో తెరంగేట్రం చేసిన తాప్సి పన్ను.. ఇక్కడ అన్ని ప్లాప్ సినిమాల్లోనే నటించింది. ఒక్క స్టార్ హీరో సినిమాలో కూడా నటించని తాప్సి... తెలుగులో ఐరెన్ లెగ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. ప్రభాస్‌తో చేసిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ మినహా.. తాప్సి నటించిన సినిమాలన్నీ యావరేజ్ మూవీస్ కావడంతో.. తెలుగులో అవకాశాలు లేని తాప్సి బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ మాత్రం తాప్సి ఒప్పుకున్న సినిమాలన్ని హిట్స్ అవుతున్నాయి. పింక్ సినిమాలో నటించిన తాప్సి.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. బాలీవుడ్ లోనే తిష్ట వేసింది. అడపాదడపా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈ అందాల భామ బాలీవుడ్‌లో.. హిట్స్‌తో దూసుకుపోతుంది. మరీ స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకోకపోయినా.. తాప్సి నటించిన బాలీవుడ్ సినిమాల్ని హిట్ అవుతున్నాయి. ఇక బాలీవుడ్ కి వెళ్ళాక దశ తిరిగిన తాప్సి.. తెలుగులోనూ ‘ఆనందో బ్రహ్మ’ సినిమాతో హిట్ అందుకుంది.

Advertisement
CJ Advs

తాజాగా బాలీవుడ్‌లో బద్‌లా సినిమాతో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది తాప్సి.. నిన్నగాక మొన్న విడుదలైన బద్‌లా సినిమాలో తాప్సి నటనకు మంచి మార్కులు పడడమే కాదు... విమర్శకుల ప్రసంశలు అందుకుంటుంది. పెర్ఫార్మెన్స్‌ పరంగా తాప్సికి బాలీవుడ్ ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడుతున్నాయి. మరి బద్‌లా సినిమా తాప్సి నటించిన పింక్ సినిమా కన్నా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. మరి తెలుగులో గ్లామర్ గా నెగ్గుకురాలేని తాప్సి.. బాలీవుడ్‌లో మాత్రం అందాలు ఆరబోయకుండా మంచి నటనతోనే మార్కులు కొట్టేస్తుంది. నిజంగానే బాలీవుడ్ హీరోయిన్స్ మాదిరిగా గ్లామర్ పాత్రలు చెయ్యకుండా నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ తాప్సి తెలివిగా బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. అందుకే టాలీవుడ్ లో ఐరెన్ లెగ్ గా ముద్రపడిన తాప్సి.. బాలీవుడ్ లో మాత్రం లక్కీ హీరోయిన్ అయ్యింది. 

Tollywood Iron Leg Turns Lucky Girl in Bollywood:

One More hit to Taapsee in Bollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs