Advertisement
Google Ads BL

వ‌ర్మ‌కు మ‌ళ్లీ ఐస్‌క్రీమ్‌పై గాలిమ‌ల్లిందండోయ్‌!


రామ్‌గోపాల్‌వ‌ర్మ మూడ్ ఎప్పుడు ఎలా ట‌ర్న్ తీసుకుంటుందో ఎవ‌రికి అర్థం కాదు. అప్పుడే సీరియ‌స్ సినిమా అంటాడు. ఆ వెంట‌నే `జీఎస్టీ` (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌) పేరుతో బూటు పురాణం మొద‌లుపెడ‌తాడు. దాని ర‌చ్చ అయిపోయిందా అనుకునే లోపే మ‌ళ్లీ మ‌రో వివాద‌స్ప‌ద సినిమాకు శ్రీ‌కారం చుడ‌తాడు. ప్ర‌స్తుతం `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` పేరుతో ఏపీ రాష్ట్ర రాజ‌కీయాల్లో ర‌చ్చ చేస్తున్న వ‌ర్మ ఈ సినిమాతో ఎంత ర‌చ్చ చేయాలో అంత ర‌చ్చ చేసేశాడు. త‌న‌ని హ‌త్య చేస్తే త‌ప్ప  `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` విడుద‌ల‌ను ఎవ‌రూఆప‌లేర‌ని స్టేట్‌మెంట్ ఇచ్చిన వ‌ర్మ కు మ‌ళ్లీ కొత్త ఆలోచ‌న వ‌చ్చింద‌ట‌. 

Advertisement
CJ Advs

ఆ మ‌ధ్య 2014లో తేజ‌స్విని క‌థానాయిక‌గా ప్ర‌మోట్ చేస్తూ `ఐస్ క్రీమ్` చిత్రాన్ని రూపొందించి త‌న‌లో వున్న ద‌ర్శ‌కుడు ప‌త‌న‌రావ‌స్థ‌కు చేరుకున్నాడ‌ని తెలియ‌జెప్ప‌న వ‌ర్మ. ఆ త‌రువాత దీనికి సీక్వెల్ అంటూ చేసిన `ఐస్ క్రీమ్‌-2`తో మ‌రింత చండాల‌మైన చిత్రాన్ని తీసిన ద‌ర్శ‌కుడిగా పేరుతెచ్చుకున్నాడు. విమ‌ర్శ‌కుల చేతిలో చీవాట్లు తిన్న వ‌ర్మ మ‌ళ్లీ త‌న ఇంట‌లిజెన్సీకి త‌గ్గ సినిమాల వైపు ట‌ర్న్ తీసుకున్నాడు. అయితే వ‌ర్మ‌కు మ‌ళ్లీ ఐస్ క్రీమ్‌ మీదికి గాలి మ‌ళ్లీంద‌ట‌. ఐస్‌క్రీమ్ 3 పేరుతో మ‌రో క‌ళాఖండాన్ని జ‌నాల మీద‌కి వ‌ద‌లాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. 

అయితే ఈ థ‌ర్డ్ ఇన్స్టాల్‌మెంట్‌కి వ‌ర్మ ద‌ర్శ‌కుడిగా వ్య‌హ‌రిచ‌డం లేద‌న్న తాజా టాక్. గ‌త ఐదేళ్లుగా వ‌ర్మ కంపెనీలోని ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేస్తున్న అక్ష‌య్‌ని ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేయబోతున్నాడ‌ట వ‌ర్మ‌. క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ మాత్ర‌మే తాను చూసుకుని ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల్ని అక్ష‌య్‌కి అప్ప‌గిస్తున్నాడ‌ట‌. దీనికి తుమ్మ‌లప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ నిర్మాతగా వ్య‌వ‌హిరించే అవ‌కాశం వుంద‌ని ఫిలిం స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. 

ram gopal varma planing to ice crem 3? :

varma planing one more sequel to ice cream 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs