ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు సంబంధంచిన ఫ్లెక్లీలను నెక్లెస్ రోడ్లో తొలగించి వాటిని ఏర్పాటు చేసిన వారికి 25 వేల జరిమానా విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అనుభవం `మా` ఎన్నికల్లో అధ్యక్షపదవికి పోటీ చేస్తున్న శివాజీరాజా, నరేష్‌లకు ఎదురైంది. అంతా ఎన్నికల హడావిడిలో వుంటే `మా` అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న శివాజీరాజా, నరేష్ లకు హైదరాబాద్ జీహెచ్ ఎంసీ అధికారులు షాకిచ్చారు. గత వారం రోజులుగా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ `మా` ఎన్నికలని వేడెక్కించారు. ఆదివారం ఎన్నికలు జరుగుతున్న వేళ అధ్యక్ష పదవి కోసం పోటీనడుతున్న శివాజీరాజా, నరేష్‌లకు హైదరాబాద్ నగరపాలక సంస్థ గట్టి షాకిచ్చింది.
నెక్లెస్ రోడ్లో నిబంధనలకు విరుద్ధంగా మంత్రి తలసాని శ్రీనివాసయాద్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ వాటిని తొలిగించి 25వేల జరిమానా విధించిన జీహెచ్ ఎంసీ అధికారులు ఫిల్మ్ నగర్‌లో అదే విధంగా నిబంధనలను పాటించకుండా విరుద్ధంగా నరేష్, శివాజీరాజా ప్యానెల్ లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలని తొలిగించి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలను నిర్ధాక్షిణ్యంగా తొలిగించిన అధికారులు వీటిని ఏర్పాటు చేసిన వారికి పెనల్టీని ఎంత విధించాలనే దానిపై అధికారుల్ని చర్చించి తెలియజేస్తామని ప్రకటించారు. మంత్రికే 25 వేల జరిమానా విధించిన అధికారులు సినిమా వాళ్లని అంత ఈజీగా వదులుతారా అని జనాలు చెప్పుకుంటున్నారు. ఈ రోజు జరుగుతున్న `మా` ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ 260 పైచిలుకు ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ ముగియనుండగా 8 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నారు.