Advertisement
Google Ads BL

వడ్డించే వాడు మనవాడైతే.. బాలయ్యకి సరిపోద్ది!


చంద్రబాబు ఏపీలో ఎమ్మెల్యేలు, ఎంపీల సీట్ల పంపకంలో తలమునకలై ఉన్నారు. రోజు పార్లమెంట్‌ వర్గాల పరిధిలో సమీక్షలు నిర్వహిస్తూ టిక్కెట్లను కేటాయిస్తున్నాడు. కానీ అనంతపురం జిల్లాకి సంబంధించిన సమీక్ష జరుగుతున్నా కూడా బాబు బావమరిది. వియ్యంకుడు బాలయ్య మాత్రం సమీక్షను లైట్‌గా తీసుకున్నాడు. తన పని తనది అన్నట్లుగా ఏదో చుట్టపు చూపుగా హిందుపురం వెళ్లాడు. బాలయ్య అసలు సరిగా హిందుపురం ప్రజలను పట్టించుకున్న పాపానా పోలేదని, ఆయన పీఏలదే అక్కడ రాజ్యమని ఎంతో కాలంగా నిరసన వినిపిస్తోంది. 

Advertisement
CJ Advs

ఆయన నియోజకవర్గ ప్రేక్షకులకు అందుబాటులో ఉండరు. కేవలం తన నియోజకవర్గానికి ఆయన ఓ అతిథిగా మాత్రమే వస్తూ పోతూ ఉంటాడు. ఆమద్య తెలుగుదేశం కార్యకర్తలు, నియోజకవర్గం ఓటర్లపై చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఆయన పీఏపై వచ్చిన ఆరోపణలు అన్ని ఇన్ని కావు. నిత్యం సినిమాలలో మునిగిపోయే ఆయన తీరిక దొరికనప్పుడు, తనకేం పని లేదన్నప్పుడు మాత్రమే హిందుపురం వస్తూ ఉంటాడు. 

తాజాగా అనంతపురం సమీక్షలో ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వవద్దని ఆ జిల్లా కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ కోవలోకి బాలయ్య కూడా వస్తాడు. కానీ ఆయన సీఎం బంధువు కావడంతో ఎవ్వరూ ఆయనపై కనీసం ఆరోపణలు చేయలేకపోతున్నారు. అలా చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో వారికి బాగా తెలుసు. ఇది మన నిజమైన ప్రజాస్వామ్యం. ఇక చంద్రబాబు కూడా మిగిలిన వారి సీట్ల విషయంలో సమీక్షలు చేస్తున్నా బాలయ్యకి మాత్రం అందులో మినహాయింపు ఇచ్చాడు. 

ఇక ఈసారి వారసులకు, సీనియర్‌ నేతలకు ఇద్దరికీ సీట్లు ఇవ్వకూడదనేది చంద్రబాబు ఉద్దేశ్యం. కానీ ఆ విషయంలో తనకి, లోకేష్‌కి మినహాయింపు ఇచ్చాడు. ఇక జెసి బ్రదర్స్‌, గల్లా కుటుంబం, పరిటాల సునీతతో పాటు కుమారుడు పరిటాల శ్రీరామ్‌కి మాత్రం ఇందులో మినహాయింపు ఇస్తూ వెళ్తున్నాడు. కానీ ఈ విషయంలో చంద్రబాబుని గట్టిగా నిలదీసే ధైర్యం మాత్రం పార్టీ నేతలు, పార్టీ సానుభూతి పరులకు కూడా లేదనేది వాస్తవమని చెప్పాలి. ఇది నిష్టుర సత్యం. 

Balayya to Contest Again from Hindupur:

TDP Declared Hindupur Constituency Members
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs