Advertisement
Google Ads BL

మైత్రీ మూవీస్ సినిమాలో విజయ్ జోడీ ఎవరో తెలుసా?


ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వెళ్లిపోయారు... ఆ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్. ఇక హీరో అయితే స్టార్ రేంజ్, హీరోయిన్ కూడా తమిళనాట కాలుపెట్టింది. మరి ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్ర చేసిన వారు కూడా కమెడియన్స్ గా ఇరగదీస్తున్నారు. మరి ఆ సినిమా ఏమిటా అనుకుంటున్నారా.. అదేనండి బోల్డ్ కంటెంట్ తో భీభత్సమైన రచ్చ మధ్య విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి. ఈ సినిమా డైరెక్టర్ సందీప్ వంగ బాలీవుడ్ కి వెళ్ళి షాహిద్ కపూర్ తో అర్జున్ రెడ్డి రీమేక్ చేసేస్తుంటే... హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయ్యాడు. ఇక హీరోయిన్ షాలిని కూడా తమిళంలోనూ, తెలుగు సినిమాలతో కాస్త బిజీ అయితే... విజయ్ ఫ్రెండ్ కేరెక్టర్ చేసిన రాహుల్ రామకృష్ణ కమెడియన్ గా చక్రం తిప్పుతున్నాడు.

Advertisement
CJ Advs

ఇక విజయ్ దేవరకొండ - షాలిని పాండేలు హాట్ లిప్ కిస్సులతో ఎంతగా పాపులర్ అయ్యారో వేరే చెప్పక్కర్లేదు. వారి కాంబినేషన్, వారి కెమిస్ట్రీ యూత్ కి బాగా ఎక్కేసింది. మరి అలాంటి కెమిస్ట్రీ మరోసారి రిపీట్ అయితే... ఆ జంట మరోమారు కలిసి నటిస్తే.. ఆ క్రేజ్ ఆ అంచనాలు ఎలా ఉంటాయో ఊహకే అందవు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా మైత్రీ మూవీస్ వారు నిర్మించబోయే సినిమాకి ఒక కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఆనంద్ అన్నామ‌లై అనే కొత్త దర్శకుడు డైరెక్షన్ లో తెరకెక్కపోయే సినిమాలో విజయ్ దేవరకొండ సరసన షాలిని పాండేని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి గీత గోవిందం బ్లాక్ బస్టర్ లో నటించిన రష్మికతో మరోసారి డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్న విజయ దేవరకొండ... అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ లో కలిసి నటించిన షాలినితో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడన్నమాట. మరి ఈ సినిమాలో షాలినితో పాటుగా మాళ‌విక మోహ‌న్ అనే మ‌ల‌యాళీ భామ ప‌రిచ‌యం అవుతోంది. ఇక ఈ చిత్రంలో విజ‌య్ ఓ బైక్ రేస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడనే న్యూస్ ఉంది.

Again Shalini Pandey in Vijay Deverakonda Film:

Vijay Deverakonda and Shalini Pandey Combo Again
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs