మహేష్‌బాబు ‘బ్రహ్మోత్సవం, స్పైడర్’ సినిమాల షాక్‌తో తాను చెయ్యబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే తనని పూర్తి స్క్రిప్ట్‌తో ఇంప్రెస్ చెయ్యలేని సుకుమార్‌నే పక్కన పెట్టేసాడు. రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి... టాలీవుడ్‌నే షేక్ చేసిన సుకుమార్ మైండ్ సెట్ తో తన మైండ్ సెట్ కలవలేదని.... స్టోరీ లైన్ తో మెప్పించలేని సుకుమార్ ని మహేష్ లైట్ తీసుకున్నాడు. ఏడాది కాలంగా మహేష్ కోసం పని చేసిన సుకుమార్ కూడా.. మహేష్ ని మెప్పించలేక మెగా హీరో అల్లు అర్జున్‌ని పట్టుకున్నాడు. మరి రంగస్థలం లాంటి భారీ హిట్ కొట్టిన డైరెక్టర్ నే లెక్క చేయని మహేష్ ఇప్పుడు అనిల్ రావిపూడి విషయంలో ఎలా రియాక్ట్ అవుతాడో అనే క్యూరియాసిటిలో ప్రేక్షకులు ఉన్నారు.
ఎందుకంటే ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి అదృష్టం కలిసొచ్చి ఎఫ్ టు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కానీ... ఆ సినిమాలో పెద్దగా విషయం లేదనేది జగమెరిగిన సత్యం. ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ లో ఫస్ట్ హాఫ్ మొత్తం వెంకటేష్ పంచ్ కామెడీతో అదిరిపోయింది. కానీ ఆ సినిమా సెకండ్ హాఫ్‌తో మాత్రం ప్రేక్షకులుకు ఫ్రస్టేషన్ వచ్చేసింది. వెకిలి కామెడీకి చిరాకు పడ్డారు. కేవలం ప్రేక్షకుడికి థియేటర్స్‌లో మరో ఆప్షన్ లేకే ఎఫ్ 2 కి పట్టం కట్టారు కానీ.. ఆ సినిమా యావరేజ్ దగ్గరే ఆగిపోవాల్సిన సినిమా.
మరి అలాంటి హిట్ కొట్టిన ఒక డైరెక్టర్ కేవలం స్టోరీ లైన్ వినిపించేసి హీరోని కమిట్ అయితే చేయించగలడు కానీ.. పూర్తి స్క్రిప్ట్ అంటూ దర్శకుల్లో దడ పుట్టిస్తున్న మహేష్ లాంటి హీరోని అనిల్ పూర్తి కథతో మెప్పించగలడా? కేవలం స్టోరీ లైన్ రాసుకుని మహేష్‌కి వినిపించిన అనిల్ రావిపూడి.. పూర్తి స్క్రిప్ట్‌తో మహేష్ ని మెప్పించగలడా? అసలు ఏ ధైర్యంతో మహేష్.. సుకుమార్ ని వదులుకున్నాడు? ఇప్పటివరకు పెద్ద హీరోలను డీల్ చెయ్యని అనిల్ ని మహేష్ గుడ్డిగా నమ్మేస్తున్నాడా? అసలు మహేష్ ఇంతవరకు అనిల్ తో సినిమా ఉంటుందని ఎక్కడ చెప్పలేదు? మరి ఇన్ని అనుమానాలతో... ఉన్న ప్రేక్షకులు సుకుమార్ నే పక్కన పెట్టేసిన మహేష్ కి అనిల్ ఓ లెక్కా అంటూ సెటైర్స్ వేస్తున్నారు.