`అర్జున్‌రెడ్డి` సినిమాతో ఏకంగా తెలుగు సినిమా స్వరూపాన్నే మార్చేశాడు విజయ్ దేవరకొండ. తన క్రేజ్‌కి తగ్గట్టుగా అడుగులు వేస్తూ టాలీవుడ్ హీరోలకి సవాల్‌గా నిలుస్తున్నాడు. `నోటా` సినిమాతో తన తమిళ మార్కెట్ స్టామినా ఏంటో తెలుసుకున్న విజయ్ తన తదుపరి చిత్రాల్ని కూడా వరుసగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నాడు. ఇందు కోసం భారీ స్కెచ్‌నే సిద్ధం చేసుకున్న విజయ్ తన వరుస సినిమాలతో దూకుడు పెంచబోతున్నాడు.
ఇకపై తను చేసే ప్రతి చిత్రాన్ని నాలుగు భాషల్లో విడుదల చేస్తూ దక్షిణాదిలో హల్ చల్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటూ సీనియర్ హీరోలని సైతం తన ప్లానింగ్‌తో విస్మయపరుస్తున్నాడు. విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం `డియర్ కామ్రేడ్`. మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమా ద్వారా భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ ఛార్మ్ రష్మిక మందన్న విజయ్‌కి జోడీగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తన ప్లానింగ్‌లో భాగంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నాడు.
విజయ్ విద్యార్థి నాయకుడిగా, రష్మిక క్రికెటర్‌గా కొత్త తరహా పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 17న టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. హిట్ పెయిర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో సినిమాలో ఎలాంటి లోపాలు లేకుండా తీర్చిదిద్దుతున్నారు. కొంత రీషూట్‌లు కూడా చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని మేలో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. విజయ్ కెరీర్‌లోనే ఈ సినిమా మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్లుందని మైత్రీ వారు బలంగా చెబుతున్నారు.