Advertisement
Google Ads BL

ఈగోతో పెట్టుకుంటే ప్రాజెక్ట్ గ‌ల్లంతే!


దుర్యోధ‌నుడి ఈగో దెబ్బ‌తింటే మ‌హాభార‌త సంగ్రామానికి దారితీసింది. శూర్ప‌ణ‌ఖ ఈగో దెబ్బ‌తింటే రామ‌రావ‌ణ యుద్ధం జ‌రిగింది. ఆంజ‌నేయుడి ఈగోతో రాముడు ఆడుకున్నాడ‌ని రామాంజ‌నేయ యుద్ధం వ‌చ్చింది. హిట్ల‌ర్ ఈగో దెబ్బ‌తింటే సెకండ్ వ‌ర‌ల్డ్ వార్ సంభవించింది. కాలం మారినా ఈగో మాత్రం మార‌డం లేదు. త‌రాలు మారినా దాని స్వ‌భావం మార‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్నే గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఇది తాజాగా ఇద్ద‌రు స్టార్‌ల మ‌ధ్య చిచ్చు పెట్టింది. ఈగోనే సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్‌గా సాగే సినీ ఇండ‌స్ట్రీలో పొర‌పాటున ఎవ‌రి ఈగో అయినా హ‌ర్ట్ అయ్యిందా ఆ ప్రాజెక్ట్ గ‌ల్లంతే. 

Advertisement
CJ Advs

అలాంటి ఈగో ఇప్పుడు ఇద్ద‌రు స్టార్‌ల మ‌ధ్య చిచ్చు పెట్టింది. ఒక స్టార్‌ హీరో ఈగో వ‌ల్ల ఫీలైన స్టార్ డైరెక్ట‌ర్ అంతే స్పీడుగా స‌ద‌రు హీరో ఈగోని దెబ్బ‌కొట్టాడు. మ‌రి ఆ హీరో ఊరుకున్నాడు. వెంట‌నే రిటార్ట్ ఇచ్చి త‌న ఈగోని సాటిస్‌పై చేసుకున్నాడు. ఆ స్టార్ హీరో మ‌హేష్‌, ఆ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌. త‌ను చెప్పింది చెయ్యాల‌న్న‌ది మ‌హేష్ ఈగో..బ్లాక్ బ‌స్ట‌ర్ మిట్టిచ్చిన నాకే మార్పులు చెబుతాడా? నేను చెప్పిందే వినాల‌న్న‌ది సుకుమార్ ఈగో. ఇది తారా స్థాయికి చేర‌డం, మ‌హేష్ త‌న‌కు చెప్పిన క‌థ కాద‌ని మ‌రో క‌థ‌తో ర‌మ్మ‌ని సుకుమార్ ఈగోని రెచ్చ‌గొట్ట‌డంతో అదే క‌థ‌ని అల్లు అర్జున్ చేత బ‌ల‌వంతంగా ఓకే చేయించి వెంట‌నే ప్ర‌క‌ట‌న ఇప్పించుకున్నాడు. 

ఇదే మ‌హేష్‌కు మండేలా చేసింది. దీంతో ట్విట్ట‌ర్‌లో మ‌హేష్ పొలైట్‌గా `క్రియేటీవ్ డిఫ‌రెన్సెస్ వ‌ల్లే సుకుమార్‌తో సినిమా ఆగిపోయింద‌ని ట్వీటేశాడు. `క్రియేటీవ్ డిఫ‌రెన్సెస్` అని మ‌హేష్ నొక్కి వ‌క్కానించ‌డంలోనే ఇద్ద‌రి మ‌ధ్య ఏ స్థాయి ర‌చ్చ‌జ‌రిగిందో అర్థ‌మైపోయింది. నేను వ‌దిలేసిన స్క్రిప్ట్‌ని మ‌రొక‌రికి అంట‌గ‌ట్టేస్తున్నాడ‌ని మ‌హేష్ వెంట‌నే స్పందించిన విధానం అంద‌రిని ఆక‌ట్టుకుంది. అయితే ఇక్క‌డ ఈ ఇద్ద‌రిలో ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌లేదు, ఎవ‌రూ ఓడిపోలేదు. త‌న ఈగోని సాటిస్‌ఫై చేసుకోవ‌డం కోసం సుక్కు చెప్పిన క‌థ‌ని మ‌హేష్ ప‌క్క‌న పెడితే..అదే క‌థ‌ని అల్లు అర్జున్ చేత ఓకే చేయించుకుని త‌న పంతాన్ని సుకుమార్ నెగ్గించుకోవ‌డం గ‌మ‌నార్హం. 

mahesh babu sukumar movie behind the story:

mahesh and sukkku film shelved because of their egoism
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs