Advertisement
Google Ads BL

దానయ్య తర్వాత లిస్ట్‌లో ఉంది ఈ నిర్మాతే!


తెలుగులో అభిరుచి ఉన్న నిర్మాతల్లో దుర్గాఆర్ట్స్‌ అధినేత కె.యల్‌.నారాయణ కూడా ముఖ్యుడు. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో ఓ హీరోయిన్‌గా అలియాభట్‌ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. అలియాభట్‌ రాజమౌళి చిత్రం అంటే నో చెప్పదనే చెప్పాలి. అందునా యంగ్‌ స్టార్స్‌ అయిన ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ మూవీ అంటే కాదనే ప్రసక్తే ఉండదు. కానీ అలియా ఇప్పటికే పలు బాలీవుడ్‌ చిత్రాలకు కమిట్‌ మెంట్‌ ఇచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈమె ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి డేట్స్‌ అడ్జస్ట్‌ చేయడం కష్టమేనని అంటున్నారు. 

Advertisement
CJ Advs

దాంతో రాజమౌళి కరణ్‌జోహర్‌ ద్వారా తన ప్రయత్నాలు సాగిస్తున్నాడట. ‘భరత్‌ అనే నేను, వినయ విధేయ రామ’ వంటి వరుస భారీ చిత్రాలు తీస్తోన్న దానయ్య ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి నిర్మాత. ఇక ఈ చిత్రం అనంతరం ఎన్టీఆర్‌, రాజమౌళిల చిత్రాలు ఎవరితో ఉంటాయి? అనే ఆసక్తికర విషయంపై చర్చ సాగుతోంది. వాస్తవానికి రాజమౌళి, ఎన్టీఆర్‌ల ఇద్దరి డేట్స్‌ కె.యల్‌.నారాయణ వద్ద ఉన్నాయి. గతంలోనే ఈ విషయం గురించి చెబుతూ, కె.ఎల్‌.నారాయణ నిర్మాతగా రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే మూవీ మహేష్‌ బాబుతో ఉంటుందని చెప్పారు. 

మరోవైపు ఎన్టీఆర్‌ డేట్స్‌ కూడా నారాయణ వద్దనే ఉండటం వల్ల ఎన్టీఆర్‌ చిత్రాన్ని ఏ దర్శకునితో చేస్తాడు? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టాప్‌ డైరెక్టర్స్‌ అందరూ బిజీ బిజీగా ఉన్నారు. ఇక మిగిలింది వినాయక్‌. ఆయనతో ఎన్టీఆర్‌కి ‘అదుర్స్‌ 2’ చేసే ఆలోచన ఉంది. కానీ వినాయక్‌ చిత్రం అంటే ఎన్టీఆర్‌ అభిమానులు నో అంటున్నారు. మొత్తానికి ఈ రెండేళ్లు దానయ్య హవా నడిస్తే రాబోయే రెండేళ్లు కె.యల్‌.నారాయణ హవా సాగే అవకాశం ఉంది. గతంలో ఎన్టీఆర్‌తో కె.యల్‌.నారాయణ.. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రాఖీ’ చిత్రాన్ని నిర్మించి ఉండటం విశేషం. 

SS Rajamouli Next Project Producer Confirmed:

KL Narayana movie in SS Rajamouli Direction
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs