Advertisement
Google Ads BL

సుక్కు ఆప్షన్.. బన్నీ కంటే ముందు ఎన్టీఆర్?


టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ మహేష్ - సుకుమార్ ల సినిమా క్యాన్సిల్ అవ్వడం. మహేష్ సాయంత్రం ట్వీట్ చేయకముందు బన్నీ - సుకుమార్ ల ప్రాజెక్ట్ అధికారంగా అనౌన్స్ చేసారు. అప్పటివరకు తన వైపు ఉన్న సుకుమార్ ఎందుకు సడన్ గా అటు షిఫ్ట్ అయ్యాడో అర్ధం కాకా మహేష్ సాయంత్రం ట్వీట్ వేసాడు. నాది, సుకుమార్ ల సినిమా కొన్ని కారణాలు వల్ల ఆగిపోయింది, సుకుమార్ చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ కి అల్ ది బెస్ట్ చెపుతున్న అని ట్వీట్ చేసాడు. అసలు బన్నీ - సుకుమార్ ల కాంబినేషన్ లో సినిమా అన్నది డిస్కషన్ లోనే లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ సడన్‌గా తెరపైకి వచ్చింది.

Advertisement
CJ Advs

అయితే ఈ ప్రాజెక్ట్ మహేష్ దగ్గరనుండి అల్లు అర్జున్ దగ్గరకు చేరేలోపు మరోచోట కూడా ఆగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ తర్వాత సుకుమార్ డైరెక్ట్‌గా అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లలేదట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి స్టోరీ చెప్పి తనతో ఒక సినిమా ఉంటుందని ప్రకటన ఇవ్వాల్సిందిగా ఎన్టీఆర్‌ను కోరాడని అంటున్నారు. కానీ ఎన్టీఆర్ అందుకు ఒప్పుకోలేదట. రాజమౌళి సినిమా పూర్తి అయ్యేవరకు ఏ సినిమా కమిట్ అవ్వనని చెప్పాడట. సుక్కు ఎంత కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించినా ఎన్టీఆర్ అదేమాట మీద ఉండడంతో ఆ ప్రాజెక్ట్ బన్నీ దగ్గరకు వెళ్ళింది. అది మ్యాటర్.

సో మొన్నటివరకు సుకుమార్ - మహేష్ - అల్లు అర్జున్ మధ్యన తిరిగిన ఈ మ్యాటర్ కొత్తగా తెరపైకి ఎన్టీఆర్ పేరు వచ్చింది. సుకుమార్, మహేష్ నుండి వెళ్లిపోవడానికి కారణం అతను అనిల్ రావిపూడి‌తో సినిమా ఒప్పుకోవడమే కారణం అని అంటున్నారు.

Sukumar 1st Option NTR for his Mahesh Project:

Sukumar and Bunny project Secret
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs