Advertisement
Google Ads BL

అన్ సీజనే ఈ సినిమాకి కలిసొచ్చింది


సినిమాలకు మార్చి నెల అన్ సీజన్. ఎందుకంటే  మార్చిలో సినిమాలు విడుదల చెయ్యడానికి దర్శకనిర్మాతలు జంకుతారు. స్టూడెంట్స్ మొత్తం ఎగ్జామ్స్ ఫీవర్ తో ఉంటారు. సినిమాలు చూసే మూడ్ ఉండదు. ఒకవేళ సినిమాకి వెల్దామన్నా.. పేరెంట్స్ ఊరుకోరు.. తోలు తీస్తారు. మరి అందుకే మార్చి ఎండింగ్ వరకు సినిమాల హడావిడి బాక్సాఫీసు వద్ద పెద్దగా కనిపించదు. ఇకపోతే గత శుక్రవారం ఎంతగా అన్ సీజన్ ఉన్నా.. కళ్యాణ్ రామ్ తన 118 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక వరసగా మూడు రోజులు సెలవలు కావడం, లో బడ్జెట్ తో ఆ సినిమా నిర్మితమవడంతో.. కళ్యాణ్ రామ్ 118 బ్రేక్ ఈవెన్ కి చేరుకోవడానికి రెడీగా వుంది. నిర్మాత మహేష్ కోనేరు కి ఈ సినిమా ఎంతో కొంత లాభాలు తెచ్చిపెట్టాలా కనబడుతుంది. అన్ సీజన్ ఉన్నప్పటికీ... కంటెంట్ ఉంటే... సినిమాలు ఆడతాయని 118 ప్రూవ్ చేసింది.

Advertisement
CJ Advs

ఇక రేపు శుక్రవారం రెండు మూడు డబ్బింగ్ సినిమాలే బాక్సాఫీసు వద్దకు రాబోతున్నాయి. ఊరు పేరు లేని ఆ సినిమాలు ప్రేక్షకులను మెప్పించడం అనేది కలే. మరి ఈ వారం కూడా కళ్యాణ్ రామ్ 118 సినిమా తప్ప ప్రేక్షకుడికి మరో ఆప్షన్ లేదు. మరి ఈ రకంగా 118 కి కలిసొచ్చేదేననే చెప్పాలి. ఇక 118 కలెక్షన్స్ కి మరో వారం ఢోకా ఉండదు కూడా. ఈనెల మొత్తం సరైన సినిమా లేక ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వాల్సిందే. 

Superb Timing to Kalyan Ram 118 Movie:

One More Week to 118 Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs