Advertisement
Google Ads BL

ఈ హీరోయిన్ కి ఆ సీనియర్ హీరోతో లవ్ ఎఫైర్ అవసరమా?


పాపం 15 ఏళ్ల ప్రాయంలోనే సినిమాల్లోకి వచ్చేయడంతో అమ్మడిని ఇప్పుడు అందరూ సీనియర్ హీరోయిన్ అనేస్తున్నారు కానీ.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది యంగ్ హీరోయిన్స్ తో కంపేర్ చేసుకుంటే హన్సిక చిన్నదే. 27 ఏళ్ల హన్సిక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాల్లో గ్యాప్ లేకుండా నటించేసింది. ఈ క్రమంలో ఒకట్రెండు లవ్ ఎఫైర్స్ కూడా మెయింటైన్ చేసిందనుకోండి. వాటిలో ఏదీ కనీసం పబ్లిక్ గా ఎనౌన్స్ చేసేవరకు కూడా నిలవలేదు. కానీ.. శింబుతో ప్రేమాయణం మాత్రం అమ్మడికి విపరీతమైన పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. అప్పుడే నయనతారను వదిలేసిన శింబు కొన్నాళ్లపాటు హన్సిక దగ్గర సాంత్వన పొందాడు. అయితే.. అది ఎక్కువకాలం నిలవలేదనుకోండి. మళ్ళీ విడిపోయారు. 

Advertisement
CJ Advs

మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత హన్సిక తన ఎక్స్ బోయ్ ఫ్రెండ్ శింబుతో రిలేషన్ షిప్ కి రెడీ అవుతోంది. వరుస లవ్ ఎఫైర్స్, కాంట్రవర్సీల అనంతరం కొన్నాళ్లుగా సింగిల్ గా ఉంటున్న శింబుకి హన్సిక మళ్ళీ దగ్గరైంది. ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. త్వరలోనే ఆ సినిమా సెట్స్ కు కూడా వెళ్లనుంది. ఈ టైమ్ లోనే మళ్ళీ శింబుతో సినిమా ఎందుకు అని హన్సికను అడగగా.. శింబు మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చాడు, చాలా ఆనందంగా ఉన్నాను అని బాంబు పేల్చింది హన్సిక. దాంతో షాక్ అవ్వడం తమిళ మీడియా వంతైంది. హన్సిక కంటే శింబు 10 ఏళ్ళు పెద్దోడు. మరి వయసు ఎలాగూ అడ్డం కాదు కాబట్టి వీళ్ళ ఈ సెకండ్ టైమ్ రిలేషన్ షిప్ అయినా పెళ్లి వరకూ నిలుస్తుందో లేదో చూడాలి. 

Hansika doing a mistake with simbu again:

Hansika is Back to Simbu after many years and they are in deep love
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs