Advertisement
Google Ads BL

ఈవారం ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ అవ్వడం లేదా?


ఏంటో మన తెలుగు సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో, ఎందుకు విడుదలవుతాయో కూడా తెలియడం లేదు. అయితే.. ఒకేరోజు మూడు లేదా కనీసం నాలుగు సినిమాలు రిలీజ్ అయిపోతాయి. లేదంటే మాత్రం కనీసం ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయరు. మార్చి 4తో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి  కాబట్టి ఇక వరుసబెట్టి సినిమాలు రిలీజ్ అవుతాయని భావించారు స్టూడెంట్స్. ఎంసెట్ గోల మొదలయ్యేలోపు కనీసం ఓ రెండువారాలపాటు సినిమాలు చూసేయాలని ఫిక్స్ అయిపోయారు. వాళ్లతోపాటు మూవీ లవర్స్ కూడా మార్చి 8న ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయ అని ఎదురుచూస్తున్న తరుణంలో.. రేపు ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ అవ్వడం లేదని తెలిసి షాకయ్యారు జనాలు. 

Advertisement
CJ Advs

టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మొదలవుతుండడమే ఇందుకు కారణమని చెబుతున్నప్పటికీ.. సరైన ప్లానింగ్ లేకపోవడమే అని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా.. ఒకవారం మొత్తాన్ని ఇలా వదిలేయడం అనేది సమంజసం కాదు. కనీసం డబ్బింగ్ సినిమాలు కూడా లేకపోవడంతో హాలీవుడ్ సినిమాలవైపే అందరి దృష్టి ఉంది.

అయినా.. ఇలా ఒకవారం మొత్తం ఏదో ఒక రీజన్ చెప్పి ఫ్రీగా వదిలేయడం, ఒకేవారం విరుచుకుపడడం అనేది చిన్న, పెద్ద నిర్మాతలకు ఎప్పుడూ మంచిది కాదు. మరి ఈ విషయాన్ని వారు ఎప్పుడు గమనిస్తారో ఏమో. సో, మూవీ లవర్స్ అందరూ ఏప్రిల్ లో విడుదలకానున్న మజిలీ, జెర్సీ సినిమాల కోసం వెయిట్ చేయాలేమో.. ఎందుకంటే అప్పటివరకూ చెప్పుకోదగ్గ సినిమాల విడుదలలు ఏమీ లేవు మరి.

No Telugu Releases this weekend:

Movie Lovers are stunned with no telugu release this weekend
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs