Advertisement
Google Ads BL

సాయిపల్లవి గ్లామర్ షో చేయదుగా.. మరెలా?


మహేష్‌ పైకి మౌనంగా, ఏమీ ఎరుగని చాక్లెట్‌ బోయ్‌లా ఉంటాడే గానీ తాను అనుకున్న పనిని తన చేతికి మట్టి అంటకుండా కానిచ్చేస్తాడు. అది తాజాగా సుకుమార్‌ చిత్రంపై ఆయన ఇచ్చిన క్లారిటీతో అర్ధమైపోతోంది. తప్పు తన మీదకి రాకుండా ముందుగా తానే రెస్పాండ్‌ అయి క్రియేటివ్‌ డిఫరెన్స్‌లంటూ బాంబ్‌ పేల్చాడు. దాంతో మహేష్‌ ఇచ్చిన చాన్స్‌ని సుకుమర్‌ ఉపయోగించుకోలేదని, ఇందులో మహేష్‌ తప్పు ఏమీ లేదని, సుకుమార్‌దే తప్పు అని అందరు అనుకునేలా పావులు కదిపాడు. అదే సమయంలో సుమాకుర్‌తో తాను చేసిన 1 నేనొక్కడినే క్లాసిక్‌ చిత్రమని, ఆ చిత్రం షూటింగ్‌ మొత్తం ఎంజాయ్‌ చేశానని చెబుతూనే మేకర్‌గా ఆయనపై గౌరవం ఉందని చెబుతూ, బన్నీ చిత్రానికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపాడు. 

Advertisement
CJ Advs

నిజానికి రంగస్థలంతో తనను తాను మాస్‌ డైరెక్టర్‌గా నిరూపించుకున్న సుకుమార్‌కి ఇది పెద్ద దెబ్బే. సుక్కుతో చిత్రం చేస్తే అయితే బ్లాక్‌బస్టర్‌ లేకపోతే డిజాస్టర్‌. కానీ ఆ రిస్క్‌ని తీసుకోకుండా మహేష్‌ మినిమం గ్యారంటీ ఖచ్చితంగా ఇచ్చే అనిల్‌రావిపూడికి ఓకే చెప్పాడు. ఇక ఇందులో మహేష్‌ సరసన సాయిపల్లవి, లేదా రష్మిక మందన్న పేర్లు బాగా వినిపిస్తున్నాయి. నిజానికి ఎంతో అందగాడైన మిల్కీబోయ్‌ మహేష్‌ ముందు ఈ ఇద్దరు సరితూగుతారా? లేదా? అన్నదే అనుమానం. ఈ ఇద్దరు గ్లామర్‌షో విషయంలో చాలా వెనుకబడి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల వల్లనే భరత్‌ అనే నేనులో కైరా అద్వానీని, మహర్షిలో పూజాహెగ్డేని తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నారు. 

కానీ వారితో పోలిస్తే నటనపరంగా సాయిపల్లవి, రష్మిక మందన్నల్లో టాలెంట్‌ ఉన్నా గ్లామర్‌డోస్‌ మాత్రం తగ్గుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మహేష్‌, దిల్‌రాజు, అనిల్‌రావిపూడిలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. 

ఇక అనిల్‌రావిపూడి చిత్రాన్ని దిల్‌రాజు, అనిల్‌సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్‌ పారితోషికం కాకుండా ఈ చిత్రానికి 50కోట్ల బడ్జెట్‌ని కేటాయించారట. కేవలం థియేటికల్‌ రైట్స్‌ ద్వారానే 100కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉండటంతో 50కోట్ల షేర్‌ నిర్మాతలకు, మిగిలిన 50కోట్లు మహేష్‌ వాటా అని తెలుస్తోంది. ఎఫ్‌2తోనే 130కోట్లు కొల్లగొట్టినప్పుడు మహేష్‌ చిత్రం హిట్టయితే ఇక ఆకాశమే హద్దు అవుతుంది. ఇక థియేటికల్‌ రైట్స్‌ కాకుండా మిగిలిన ఆదాయాలన్నీ నిర్మాతలకే అని సమాచారం.

Sai Pallavi in Mahesh and Anil Ravipudi Film:

Mahesh Babu Next Film Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs