Advertisement
Google Ads BL

‘క‌థ‌నం’ మహిళా దినోత్సవం స్పెషల్ ఇదే


మహిళా దినోత్సవం సందర్బంగా  క‌థ‌నం టీజర్ విడుదల

Advertisement
CJ Advs

ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం క‌థ‌నం. బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ‌చుక్కా ఈ చిత్రానికి నిర్మాత‌లు. రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అన‌సూయ భ‌ర‌ద్వాజ్ మెయిన్ లీడ్ గా న‌టిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్బంగా ఈ చిత్ర టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయనున్నారు.

ఈ సందర్బంగా నిర్మాత 

న‌రేంద్ర రెడ్డి మాట్లాడుతూ...  క‌థ న‌చ్చి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాము. అన‌సూయ‌ గారు ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. ఆవిడ కేరీర్ లో ఇదొక బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది. మహిళా దినోత్సవం సందర్బంగా మార్చి8 న టీజర్ ను విడుదల చేస్తున్నామన్నారు.

దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ... ఇది నా మొద‌టి చిత్రం. క్ష‌ణం, రంగ‌స్థ‌లం అనంతరం క‌థ‌నంతో  హ్యట్రిక్ కొట్ట‌బోతుంది అన‌సూయ‌గారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. న‌రేంద్ర‌రెడ్డిగారు పంపిణిదారునిగా  ఏ సినిమా చేసిన హిట్ ఆయ‌న‌ది ల‌క్కీ హ్యాండ్. ఏ సినిమా చేసినా హిట్ అయ్యాయి. నిర్మాతగా కూడా సక్సెస్ అవుతారన్నారు..

ఇంకా ఈ చిత్రంలో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ, స‌మీర్‌, ముఖ్తార్‌ఖాన్‌, రామ‌రాజు, జ్యోతి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్: బాలాజీ శ్రీ‌ను, ఎడిట‌ర్: ఎస్‌.బి. ఉద్ద‌వ్‌, మ్యూజిక్: సునీల్ క‌శ్య‌ప్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్: కె.వి.ర‌మ‌ణ‌, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీ: స‌తీష్ ముత్యాల‌, లైన్ ప్రొడ్యుసర్ : ఎమ్‌.విజ‌య చౌద‌రి, నిర్మాత‌లు: బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా, క‌థ‌, స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వం: రాజేష్ నాదెండ్ల‌

Kathanam Movie Teaser Release details:

Kathanam Teaser on Womens day
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs