Advertisement
Google Ads BL

బన్నీని తక్కువ అంచనా వేశారుగా.. చూడండి


తన కెరీర్‌లో ఎన్నడు లేని విధంగా స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా తర్వాత లాంగ్‌గ్యాప్‌ తీసుకున్నాడు. సుకుమర్‌ తర్వాత ఏరికోరి స్టార్‌రైటర్‌ వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేసిన బన్నీకి ఈ చిత్రం షాకిచ్చింది. అంతకు ముందు చేసిన డిజె కమర్షియల్‌గా సక్సెస్‌ అయిందని దర్శకనిర్మాతలు, హీరో చెప్పారు గానీ సగటు ప్రేక్షకుడి నుంచి ఆ మూవీకి పెదవి విరుపే లభించింది. దీంతో దాదాపు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో చిత్రాన్ని ఏడాది గ్యాప్‌ తర్వాత బన్నీ స్టార్ట్‌ చేసే అవకాశం ఉంది. కానీ ఈ మధ్యకాలంలో ఆయన కేవలం త్రివిక్రమ్‌ కోసమే ఫ్రీగా వెయిట్‌ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ తెర వెనుక మాత్రం ఆయన చాలా స్పీడుగా వేగం పెంచాడని తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్ధమవుతోంది. 

Advertisement
CJ Advs

జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి తర్వాత మూడో హ్యాట్రిక్‌ చిత్రంగా అల్లుఅర్జున్‌, త్రివిక్రమ్‌ల మూవీ రూపొందనుంది. ఆ తర్వాత చిత్రం సుకుమార్‌తో మైత్రి మూవీ మేకర్స్‌లో ఉండనుంది. ఇదే సమయంలో బన్నీ ఆ తదుపరి చిత్రాన్ని దక్షిణాది దిగ్గజ దర్శకుడు మురుగదాస్‌తో చేయనున్నాడట. ప్రస్తుతం మురుగ, రజనీల చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. త్రివిక్రమ్‌, సుక్కుల చిత్రాలు పూర్తయ్యే సరికి మురుగ, రజనీ చిత్రం పూర్తి చేసి బన్నీ కోసం రెడీగా ఉంటాడు. ఎంతోకాలంగా అల్లుఅర్జున్‌ నేరుగా మలయాళ, తమిళ ఇండస్ట్రీలలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. గతంలో హరి, లింగుస్వామి వంటి వారి పేర్లు కూడా వినిపించాయి. కానీ చివరకు ఆయన మురుగదాస్‌కే మొగ్గుచూపాడు. 

మహేష్‌ని స్పైడర్‌తో కోలీవుడ్‌ లాంచ్‌ చేసే విషయంలో దెబ్బతిన్న మురుగదాస్‌ వైపే బన్నీ మొగ్గు చూపడం విశేషం. ఈ చిత్రం తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతోన్న విక్రమ్‌ కె.కుమార్‌ మూవీని బన్నీ చేయనున్నాడు. ఇది కూడా తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్‌గా రూపొందనుందని తెలుస్తోంది. ఆ తదుపరి తన వరుస ఐదో చిత్రం ద్వారా బన్నీ బాలీవుడ్‌ ఎంట్రీ కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. ఇప్పటికే బహుభాషల్లో, మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ప్రభాస్‌ ప్రభంజనం చూసిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. 

మొత్తానికి ఈ గ్యాప్‌లో అల్లు అర్జున్‌ తన తదుపరి మూడేళ్లకు సరిపడే ప్రాజెక్ట్స్‌ని సెట్‌ చేసుకున్నాడనే చెప్పాలి. త్రివిక్రమ్‌తోనే కాదు. సుకుమార్‌తో కూడా ఆయన చేయబోయే చిత్రాలు ఆయా దర్శకులతో బన్నీకి మూడో చిత్రాలే కావడం విశేషం. ఇదే సమయంలో నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా వంటి డిజాస్టర్‌ తర్వాత ఎంతో గ్యాప్‌ తీసుకున్న బన్నీకి త్రివిక్రమ్‌ పెద్ద హిట్‌ని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు సుక్కు కూడా లైన్‌లో ఉన్నాడు కాబట్టి వీలైనంత ఎక్కువ సమయం తీసుకోకుండా ఆరేడు నెలల్లో త్రివిక్రమ్‌ తన బన్నీ చిత్రాన్ని పూర్తి చేయాల్సివుండటంతో అది త్రివిక్రమ్‌కి తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. 

Allu Arjun To Enter Bollywood:

Bunny’s Silence Before Thunder Storm!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs