Advertisement
Google Ads BL

సుకుమార్‌తో వదులుకున్నందుకు 50 కోట్లా?


మహేష్ బాబు.. దర్శకుడు సుకుమార్ ని పక్కన పెట్టేసి.. ఎఫ్ 2 తో భారీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడితో మహర్షి సినిమా తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టడానికి సిద్దమవుతున్నాడు. సుకుమార్ తో మహేష్ సినిమా మొదలవుతుంది అనుకున్న తరుణంలో ఒకపక్క సుకుమార్ షాక్.. మరోపక్క మహేష్ షాకులు మీద షాకులిచ్చారు. సుకుమార్.. అల్లు అర్జున్ తో సినిమా మొదలుపెట్టబోతున్నట్టుగా ప్రకటన వచ్చిన వెంటనే మహేష్ కూడా సుకుమార్ తో సినిమా ఆగిపోయిందనే ట్వీట్ తో మహేష్ అభిమానులే కాదు... మెగా అభిమానులుతో పాటుగా సాధారణ ప్రేక్షకులు కూడా షాక్ తిన్నారు.

Advertisement
CJ Advs

ఇక మహేష్ ట్వీట్ వేసేసి.. అనిల్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించడం మొదలెట్టేసాడట. అనిల్ రావిపూడి - మహేష్ కాంబో మూవీని ఎఫ్ 2, మహర్షి నిర్మాత దిల్ రాజే నిర్మించబోతున్నాడు. మహర్షికి సోలో నిర్మాతగా చెయ్యాలనుకున్న దిల్ రాజుకి అశ్వినీదత్, పివిపి తగిలినట్టుగా.. ఇప్పుడు అనిల్ రావిపూడితో మహేష్ చెయ్యబోయే సినిమాకి అనిల్ సుంకర అనే మరో నిర్మాతో కలిసి చెయ్యాల్సిన అవసరం ఏర్పడింది. మరి దిల్ రాజు - అనిల్ సుంకర కాంబోలో మహేష్ మూవీ త్వరలోనే పట్టాలెక్కబోతుంది. అయితే ఈ ప్రాజెక్టులోకి మహేష్ గత చిత్రాల నిర్మాత అనిల్ సుంకర ఎలా కలిసాడంటే ... 14 రీల్స్ బ్యానర్ లో అనిల్ సుంకర భాగస్వామిగా....  మహేష్ తో తీసిన దూకుడు,  1 నేనొక్కడినే, ఆగడు సినిమాల్లో ఒకే ఒక్కటి హిట్ అవడంతో.. 14 రీల్స్ ద్వారా అనిల్ సుంకర భారీగా నష్టపోవడంతో.. మహేష్ బాబు, అనిల్ కి అప్పట్లో భవిష్యత్తులో నీతో ఒక సినిమా చేస్తానని మాటిచ్చాడట.

ఇక మహేష్ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలని అనిల్ సుంకరని.. అనిల్ రావిపూడి సినిమాలో భాగస్వామిని చేసాడు. ఇక అనిల్ సుంకర - దిల్ రాజులూ కలిసి మహేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారట. అయితే ఈ సినిమాకి మహేష్ బాబు ఆకాశాన్ని తాకే పారితోషకం అందుకోబోతున్నాడంటున్నారు. మహేష్ - అనిల్ రావిపూడి సినిమాకి జరిగే బిజినెస్ లో మహేష్ కి అర్ధభాగం ఇవ్వాలని డీల్ కుదుర్చుకున్నట్లుగా సోషల్ మీడియా టాక్. మరి ఈ మధ్యన మహేష్ సినిమాలు 100 కోట్ల పైమాటే బిజినెస్ జరుపుకుంటున్నాయి. ఇక అందులో అర్ధభాగం అంటే 50 కోట్ల పైమేరే మహేష్ పారితోషకం కింద అందుకోబోతున్నాడనే న్యూస్ టాలీవుడ్ లో విపరీతంగా వైరల్ అయ్యింది. 

Mahesh Babu remuneration for Anil Ravipudi film:

50 Crores Offer to super star Mahesh babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs