Advertisement
Google Ads BL

RRR: హైదరాబాద్ బోర్డర్ దాటుతోంది


గత ఏడాది నవంబర్‌లో అతి భారీ అంచనాల మధ్య అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా మొదలైన RRR షూటింగ్ ఇప్పుడు జెట్ స్పీడు‌తో సాగుతుంది. మొదటి షెడ్యూల్ తర్వాత జక్కన్న కాస్త గ్యాప్ తీసుకుని కొడుకు కార్తికేయ పెళ్లిని చేసేసి.. మళ్ళీ జనవరి 20 నాటికి రామ్ చరణ్ తో సెకండ్ షెడ్యూల్ మొదలెట్టేసాడు. అయితే మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన రాజమౌళి.. సెకండ్ షెడ్యూల్ లో రామ్ చరణ్ పై సోలో సీన్స్ ని తెరకెక్కించాడు. సినిమా 1947 బ్రిటిష్ కాలంనాటి నేపథ్యంలో తెరకెక్కుతుండడంతో... ఆ కాలం నాటి సెట్స్ కి రాజమౌళి అధిక ప్రాధాన్యతనిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక సెకండ్ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ కి గ్యాప్ ఇచ్చిన రాజమౌళి మూడో షెడ్యూల్ లో మాత్రం రామ్ చరణ్ తోనూ ఎన్టీఆర్ తోనూ భారీ షెడ్యూల్ ప్లాన్ చేసాడట. ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ ని కాస్త చిన్నవిగా చేసిన రాజమౌళి మూడో షెడ్యూల్ ని మాత్రం భారీగా 40 రోజుల పాటు.. ఇతర రాష్ట్రం కేరళలో చిత్రీకరిస్తాడట. ఇప్పటివరకు హైదరాబాద్ లోనే షూటింగ్ చేసుకున్న RRR ఇప్పుడు మొదటిసారి హైదరాబాద్ బోర్డర్ దాటి కేరళ వెళుతుంది. ఇక కేరళలోని కొన్ని ప్రత్యేకమైన లొకేషన్లలో RRR సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు తీయబోతున్నాడట. ఇక ఈ సినిమాలో ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లు కూడా హైలెట్ అవ్వనున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయట. ఇకపోతే ఈ షెడ్యూల్ లో అయినా రాజమౌళి RRR హీరోయిన్స్ పై క్లారిటీ ఇస్తాడో లేదో తెలియదు కానీ.. ఈ మూడో షెడ్యూల్ మాత్రం ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి పాల్గొంటారట.

ఇక హీరోయిన్స్ విషయంలో మాంచి సస్పెన్స్ మెయింటింగ్ చేస్తున్న రాజమౌళి మూడో షెడ్యూల్ నాటికీ హీరోయిన్స్ ని రివీల్ చేస్తాడో లేదో అనే క్యూరియాసిటీ మాత్రం ప్రేక్షకుల్లో పోలేదు. ఇక ఎన్టీఆర్, చరణ్ కలిసి ఒకే షెడ్యూల్ లో పాల్గొంటే.. ఇక మెగా, నందమూరి ఫాన్స్ కి పండగే. ఇకపోతే రాజమౌళి సినిమా కోసం ఎన్టీఆర్ మేకోవర్ అవుతున్న విషయం కళ్యాణ్ రామ్ 118 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు బయటపడింది. కాస్త లావుగా, గుబురు గెడ్డం‌తో ఎన్టీఆర్ న్యూ లుక్ లో కనిపించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పూర్తి కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నాడట. 

మొదటి నుండి రామ్ చరణ్ కూడా కొత్త హెయిర్ స్టైల్ నార్మల్ లుక్ లోను, ఎన్టీఆర్ న్యూ లుక్ లోను RRR లో కనిపిస్తారని చెబుతున్నారు. ఇక రామ్ చరణ్ బర్త్‌డే కి RRR నుండి లుక్ ఏది రాదని... మూడో షెడ్యూల్ పూర్తయ్యాకే RRR లుక్ గురించి రాజమౌళి ఆలోచిస్తాడనే టాక్ కూడా మొదలైంది. మరి రాజమౌళి సినిమా మొదలు పెట్టాక ఆ సినిమాలోని కీలక పాత్రలు పుట్టిన రోజుల సందర్భంగా వారి లుక్స్ వదలడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ నెలలో పుట్టినరోజు జరుపుకోబోయే RRR హీరో రామ్ చరణ్ కి రాజమౌళి ఎలాంటి ట్రీట్ ఇస్తాడో చూడాలి.

Rajmouli RRR Movie Latest Update:

Ram Charan and Jr NTR getups in RRR Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs