కొందరు హీరోయిన్లు హీరోల కంటే కఠినంగా, క్షుణ్ణంగా ఉంటారు. ఏ అవకాశం పడితే అందులో వచ్చిందే చాన్స్ కదా అని ఒప్పుకునే రకంగా ఉండరు. ఎంతటి స్టార్ హీరో చిత్రమైనా తమ పాత్ర నచ్చితేనే ఓకే చెబుతారు. అలాంటి వారిలో నాటి భానుమతి ఒకరు. ఆమె ఎంతటి హీరో చిత్రమైనా తన పాత్రకి ప్రాధాన్యం లేకపోతే నో చెబుతోంది. ఆ తర్వాత జయసుధ, భానుప్రియ, సౌందర్య నుంచి నిత్యామీనన్ వరకు అదే రూట్‌ని ఫాలో అయ్యారు. ఇక అంతలా కాకపోయిన ఎంతో కొంత తన ప్రాధాన్యం ఉన్న చిత్రాలకే ఓకే చెప్పే నయా భానుమతి ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవినే అనేది నిజం.
విషయానికి వస్తే మొత్తానికి మహేష్‌బాబు, సుకుమార్‌తో చేయనున్న 26వ చిత్రం క్యాన్సిల్ అయిపోయిందని అఫీషియల్ న్యూస్ వచ్చింది. అదే సమయంలో దిల్‌రాజు, అనిల్‌సుంకరల కాంబినేషన్‌లో ఎఫ్2 దర్శకుడు అనిల్‌రావిపూడి చిత్రం ఉండనుంది. దిల్‌రాజుకి ఆస్థాన సంగీత విద్యాంసుడుగా దేవిశ్రీకి ఎలాంటి హోదా ఉందో సాయిపల్లవి, అనిల్‌రావిపూడిలపై కూడా ఆయనకు అంత నమ్మకం ఉంది. ఇక అనిల్‌రావిపూడి తీసిన ‘పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్,ఎఫ్ 2’ చిత్రాలలో హీరోయిన్లను ఎంతో తెలివిగా వాడుకున్నాడు. సాక్షాత్తు రాఘవేంద్రరావు ఎఫ్2కి రిపీట్ ఆడియన్స్‌ని రప్పించడంలో తమన్నా, మెహ్రీన్‌ల అందాల ప్రదర్శన కూడా కీలక భూమిక పోషించిందని విశ్లేషించాడు.
ఇలాంటి సమయంలో అనిల్‌రావిపూడి మహేష్‌ని ఒప్పించి, తన మహేష్ చిత్రంలో ఓ హీరోయిన్‌గా సాయిపల్లవిని తీసుకున్నాడని తెలుస్తోంది. ఆమెకి, దేవిశ్రీప్రసాద్ ఇద్దరికీ అనిల్ ఇప్పటికే స్టోరీ నెరేషన్ ఇచ్చాడని తెలుస్తోంది. కానీ ఈ చిత్రం సాయిపల్లవి చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి గానీ ఆమె ఓకే చేస్తే గ్లామర్‌షోకి పెద్దగా ఆస్కారం ఉండదు. మరి ఈ లోటుని రెండో హీరోయిన్, ఐటం గర్ల్‌ల ద్వారా అనిల్ పూడుస్తాడా? లేక కాస్తైనా సాయిపల్లవి చేత గ్లామర్‌షో చేయిస్తాడా? మహేష్‌ని ఒప్పించడం సరే.. ఈ విషయంలో ఆయన సాయిపల్లవిని ఎలా మెప్పిస్తాడు? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తానికి మహేష్ పక్కన సాయిపల్లవి చేసే అవకాశం ఉందా? లేదా? అనేది తెలియడానికి కాస్త సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం వాస్తవం...!