Advertisement
Google Ads BL

118 ఇక్కడ సూపరే కానీ.. అక్కడే..?


చాన్నాళ్లకు కళ్యాణ్ రామ్‌కి 118 తో హిట్ పడింది. అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లకు పరమ భక్తుడైన మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించగా.. కెవి గుహన్ సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా ప్రమోట్ అయ్యి.. ఈ సినిమాని ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించాడు. ఈ సినిమా థ్రిల్లర్ సబెక్టు‌తో తెరకెక్కిన.. థ్రిల్లింగ్ హిట్‌గా నిలిచింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. గత రెండు నెలలుగా ఉసూరుమంటున్న బాక్సాఫీసు ఈ 118 మూవీ హిట్‌తో కళకళ లాడుతుంది. ఇక కెరీర్ లో కళ్యాణ్ రామ్ మూడో హిట్ అందుకున్నాడు.

Advertisement
CJ Advs

తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న 118 మూవీ ఫస్ట్ వీకెండ్ లో సుమారుగా 4 కోట్ల షేర్ ని వసూలు చేసి పర్వాలేదనిపించింది. ఇక నిన్న శివరాత్రి సెలవు కూడా కళ్యాణ్ రామ్‌కి కలిసొచ్చింది. ఈ ఆదివారం, సోమవారం థియేటర్స్ ఫుల్ గా... నిండుగా కనబడ్డాయి. 118 సినిమా ఆడుతున్న థియేటర్స్‌లో కాస్త కళ కనబడింది. ఈ లెక్కన చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే 118 మూవీ  నాలుగు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ మార్కు చేరిపోతుంది. అన్ సీజన్‌లో వచ్చినా 118కి లాభాలు రావడం ఖాయం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఎలాగూ వచ్చే వారం చిన్న చిన్న సినిమాలే విడుదలవుతున్నాయి కాబట్టి... వచ్చే వారం కూడా 118దే హవా అంటున్నారు.

మరి ఇక్కడ బాగానే ఉన్న 118 కలెక్షన్స్ ఓవర్సీస్‌లో డల్‌గా ఉన్నాయి. ఫస్ట్ డే హిట్ టాక్‌కి నెక్స్ట్‌డే ఈ సినిమా‌కి కొన్ని లొకేషన్స్‌ని యాడ్ చేసినా అక్కడ 118 కలెక్షన్స్ కాస్త తక్కువగా ఉన్నాయంటున్నారు. కళ్యాణ్ రామ్‌కి ఓవర్సీస్ మార్కెట్ అంతగా లేకపోవడమే ఈ డల్ వసూళ్లకు కారణమంటున్నారు. అందులోనూ ఓవర్సీస్ లో టాలీవుడ్ సినిమాల హవా గత రెండు నెలలుగా చాలా తగ్గింది. విడుదలైన ప్రతి సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో.. అక్కడ ఓవర్సీస్ మార్కెట్ కూడా డల్ అయ్యింది. అందుకే కళ్యాణ్ రామ్ సినిమా మీద, కలెక్షన్స్ మీద ఆ ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంది. ఓవర్సీస్‌లో 118 మూవీకి భారీ ప్రమోషన్స్ చేసినప్పటికీ ఈ రకమైన సాదా సీదా కలెక్షన్స్ చూసి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కంగారు పడుతున్నారు. అందుకే ఇక్కడ బొమ్మ సూపర్.. అక్కడ మాత్రం కాస్త డల్‌గా వుంది.

No Collections to 118 Movie at Overseas:

118 failed at Overseas Market
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs