Advertisement
Google Ads BL

నగుమోము నగ్మా పెళ్లి ఎప్పుడంటే..?!


దివ్యభారతి తర్వాత తెలుగులో సుమన్‌ నటించిన ‘పెద్దింటల్లుడు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై నాడు అగ్ర స్టార్స్‌గా కొనసాగుతున్న చిరంజీవి నుంచి రజనీ కాంత్‌ వరకు సుమన్‌ నుంచి రాజశేఖర్‌ వరకు అందరితో జోడీ కట్టి దక్షిణాదిన ఓ వెలుగు వెలిగిన స్టార్‌ హీరోయిన్‌ నగ్మా. ఈమె సోదరే సూర్య శ్రీమతి జ్యోతిక అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన ఆమె కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతూ, ఉత్తరాదిన, బాలీవుడ్‌లో కూడా తనకున్న ఇమేజ్‌ దృష్ట్యా ఎన్నికల ప్రచారాలలో కీలక పాత్రను పోషిస్తోంది. ఈమెకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వద్ద మంచి పేరు, సాన్నిహిత్యం ఉన్నాయని అంటారు. ఇక నాడు ఈమె కోలీవుడ్‌లో ఓ సీనియర్‌ స్టార్‌తో ఎఫైర్‌ నడిపింది. ఆ తర్వాత భోజ్‌పురి సూపర్‌స్టార్‌, ‘రేసుగుర్రం’ విలన్‌ రవికిషన్‌తో ఈమె సహజీవనం చేసినట్లు కూడా మీడియా కోడై కూసింది. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా ఈమె అల్లుఅర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతాఆర్ట్స్‌ల భాగస్వామ్యంలో రూపొందే చిత్రంలో బన్నీకి తల్లిగా మరోసారి తెలుగులోకి రీఎంట్రీ ఇస్తోందని వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆమె మాట్లాడుతూ, త్రివిక్రమ్‌, అల్లుఅర్జున్‌ల చిత్రంలో నటించమని నన్నెవ్వరూ సంప్రదించలేదు. అది పుకారే. అయితే ఓ థ్రిల్లర్‌ మూవీలో నటించమని తెలుగు నుంచి నాకు ఆఫర్‌ వచ్చింది. అయితే కథలో, నా పాత్రలో కొన్ని మార్పులు చేర్పులు చేయమని చెప్పాను. అ మార్పులు నచ్చితే చేస్తాను అని చెప్పింది. మరి ఇంతకీ ఆ థ్రిల్లర్‌ మూవీ ఏమిటి? అనే దానిపై చర్చ నడుస్తోంది. 

ఇక ఈమెని పెళ్లి విషయం అడిగితే మాత్రం, పెళ్లి ఎప్పుడు జరగాలని రాసి పెట్టి ఉంటే అప్పుడు జరుగుతుంది. ఎవరికైనా పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? అసలు జరుగుతుందా? లేదా? అనే విషయాన్ని దేవుడు ముందే రాసి పెట్టి ఉంటాడు. దానిని నేను డిసైడ్‌ చేయలేను. కానీ నేను పెళ్లికి వ్యతిరేకిని కాదని గడుసుగా సమాధానం ఇచ్చింది. నిజమే.. నగ్మా చెప్పినట్లు కళ్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదు. మరి నగ్మా ఏ వయసులో వివాహం చేసుకుని సెటిల్‌ అవుతుందో వేచిచూడాల్సివుంది..!

Senior Actress Nagma speaks about her Marriage:

No Nagma in Trivikram and Allu Arjun Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs