Advertisement
Google Ads BL

నో డౌట్స్.. మహేష్ నెక్స్ట్ ఈ దర్శకుడితోనే!


మహేష్ బాబుతో సినిమా చెయ్యడానికి బోలెడంతమంది డైరెక్టర్స్ క్యూలో ఉన్నారు. ఏ సినిమా హిట్ అయినా.. ఆ సినిమా డైరెక్టర్ తో మహేష్ సినిమా అంటూ వార్తలు రావడం పరిపాటిగా మారిపోయింది. ఇక రంగస్థలం తర్వాత సుకుమార్, మహేష్ తో సినిమా చెయ్యడానికి రంగం సిద్ధం చెయ్యడం.. మహేష్ కూడా అధికారికంగా సుక్కు సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వడం జరిగాయి. ఇక మధ్యలో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా.. మహేష్ ని లైన్ లో పెట్టేందుకు నానా తంటాలు పడితే.. సందీప్ వంగా చెప్పిన కథ నచ్చక సందీప్ వంగాని రీసెంట్ గా మహేష్ పక్కన పెట్టాడనే న్యూస్ నడిచింది.

Advertisement
CJ Advs

ఇక తాజాగా ఎఫ్ 2 డైరెక్టర్ అనిల్ రావిపూడితో, మహేష్ సినిమా కన్ఫర్మ్ అంటూ వార్తలొస్తున్నాయి. అనిల్ రావిపూడితో మహర్షి సినిమా తర్వాతే సినిమా ఉండబోతుంది అంటూ వార్తలొస్తున్నాయి. మరోపక్క సుకుమార్ చెప్పిన కథకు మహేష్ కనెక్ట్ అవడం లేదు.. సుక్కుని కూడా మహేష్ హోల్డ్ లో పెట్టాడనే న్యూస్ కూడా విపరీతంగా ప్రచారం జరుగుతుంటే.. అసలు మహర్షి తర్వాత మహేష్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడో తెలియక మీడియా కూడా కన్ఫ్యూషన్ లో ఉంది. మరోపక్క మహేష్ దర్శకుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడనే న్యూస్ ఒకటి.

తాజాగా సుకుమార్.. మహేష్‌తో తన సినిమా పక్కా... అని అదికూడా మహర్షి తర్వాతే ఉండబోతుందని సన్నహితుల దగ్గర చెబుతున్నాడట. మహేష్ - అనిల్ రావిపూడి కాంబోలో సినిమా ఓకే అయితే అవ్వొచ్చు కానీ.. ఆ సినిమా నా ప్రాజెక్ట్ తర్వాతే ఉంటుందని.. సుకుమార్ ధీమాగా ఉన్నాడట. మరి సుకుమార్ కథ మహేష్ కి నచ్చక సుక్కును హోల్డ్ లో పెట్టాడనే న్యూస్ నిజమే.. కానీ సుకుమార్ తర్వాత మరో కథని రెడీ చేసి మహేష్ ని ఒప్పించాడట. మహేష్‌తో తాను తీయబోయే థ్రిల్లర్ సినిమా స్క్రిప్టు పనులు చివరి దశలో ఉన్నాయని.. మహేష్, మహర్షి సినిమా ఫినిష్ అయ్యి... ఫ్రీ అయ్యే సమయానికి తన స్క్రిప్టు పక్కాగా రెడీ అయ్యి... ప్రి ప్రొడక్షన్ దశలో ఉంటుందని చెప్పడమే కాదు.. జూన్ నుండి తమ సినిమా మొదలవుతుందని కూడా చెబుతున్నాడట.

No Doubts.. Mahesh Babu Next film Director Confirmed:

Sukumar Full Confident on Movie With Mahesh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs