Advertisement
Google Ads BL

సూపర్ కిక్కిచ్చే కాంబినేషన్‌లో మూవీ!


‘అర్జున్ రెడ్డి, గీత‌గోవిందం’ సినిమాలతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో అవతారమెత్తిన విజయ్ దేవరకొండ క్రేజ్ తెలుగులో మాములుగా లేదు. గత ఏడాది టాక్సీవాలా హిట్‌తో ఉన్న విజయ్ దేవరకొండ వరస సినిమాలతో బిజీగా వున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ వేసవిలో విడుదలకు సిద్దమవుతుండగా.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమాతో సెట్స్ మీదున్నాడు. ఇక వరసగా సినిమాలు ఒప్పుకుని సైన్ చేస్తున్న విజయ్ గత ఏడాది తమిళంలోనూ ఒక సినిమా చేసి అక్కడ కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా విజయ్ దేవరకొండ మరో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న సినిమాకు ఓకే చెప్పాడనే న్యూస్ నడుస్తుంది.

Advertisement
CJ Advs

తమిళనాట ప్రముఖ నిర్మాత అయిన ఎస్.ఆర్.ప్రభు కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తీయనున్న సినిమాలో హీరోగా విజయ్‌ దేవరకొండ చెయ్యబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ.. లేడీ సూపర్ స్టార్ నయనతారతో కలిసి నటించబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది. ఈ సినిమాలో నయనతార కన్ఫర్మ్‌గా నటిస్తుందట. కానీఈ విషయం అఫీషియల్‌గా కన్ఫర్మ్ కావలసి ఉంది. ఇప్పటికే యంగ్ అండ్ సీనియర్ హీరోస్ తో తెగ సినిమాలు చేస్తున్న నయనతార లేడీ డైనమిక్‌గా గ్లామర్ భామగా అదరగొట్టేస్తూ లేడీ సూపర్ స్టార్‌గా వెలుగొందుతోంది. అలాంటి విజయ్ - నయనతార కాంబోలో మూవీ అంటే ఆ సినిమా మీద భారీ అంచనాలుంటాయి.

ఎలాగూ నయనతారకు తెలుగులో ఫుల్ డిమాండ్ ఉంది. కాకపోతే నయనతార ప్రస్తుతం సీనియర్ హీరో సినిమా అయిన సైరా నరసింహారెడ్డిలో నటిస్తుంది. మరి చిరుతో జోడీ కడుతున్న నయన్ ఇప్పుడు మరీ యంగ్ అయిన విజయ్ తో కూడా నటిస్తుంది. మరి వారి కాంబో ఎలా ఉంటుందో అంటున్నారు కానీ.. ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోతో ఆ లేడి సూపర్ స్టార్ గనక జోడి కడితే... ఆ క్రేజే వేరబ్బా.. అనేవాళ్లు కూడా లేకపోలేదు.

Movie in Vijay Deverakonda and Nayanthara Combo:

Lady Super Star Nayanthara in Vijay Deverakonda Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs