Advertisement
Google Ads BL

సినిమాల్లేకపోయినా బోయపాటి బిజీ బిజీ..!


‘వినయ విధేయ రామ’ దెబ్బకి బోయపాటి శీను.. ‘ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు’ దెబ్బకి బాలకృష్ణ సైలెంట్ అయ్యారు. లేదంటే బాలయ్య - బోయపాటి కాంబో ఈపాటికి పట్టాలెక్కేసేదే. ఎప్పుడో అనౌన్స్ చేసినా.. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం పట్టాలెప్పుడు ఎక్కుతుందో తెలియదు. ఎందుకంటే బాలకృష్ణ ఎన్నికల హడావిడిలో.. బోయపాటి సినిమాకి మూడునాలుగు నెలలు పెండింగ్ పెట్టే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. అలాగే ఎన్‌బికే ఫిలిమ్స్‌లో బోయపాటి సినిమాని నిర్మిస్తానని చెప్పిన బాలయ్య ప్రస్తుతం పునరాలోచనలో ఉన్నాడని.. అందుకే బోయపాటి కూడా బాలయ్యతో చేసే సినిమా కోసం వేరే నిర్మాత వేటలో ఉన్నాడనే టాక్‌తో పాటుగా బాలకృష్ణ సినిమా లేట్ అవుతుందని ‘బెంగపెట్టుకున్న బోయపాటి’ అనే టైటిల్ తో సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

Advertisement
CJ Advs

అయితే బాలకృష్ణతో సినిమా లేట్ అవుతున్నందుకు బోయపాటి అస్సలు ఫీల్ అవడం లేదట. ఎందుకంటే బోయపాటి అసలు ఖాళీగా ఉంటే బాలకృష్ణ మూవీ గురించి బెంగ పెట్టుకుంటాడు. ప్రస్తుతానికి బోయపాటి అసలు ఖాళీగా లేడట. ఎందుకంటే బోయపాటి ఇప్పుడు సెట్స్ మీద బిజీగా వున్నాడు. అయితే అది సినిమా సెట్స్ మీద కాదుగాని.. యాడ్స్ షాట్ లో బోయపాటి బిజీ అయ్యాడట. ప్రస్తుతం బోయపాటి ఏపీ రాజధాని అమ‌రావ‌తిలో తెలుగుదేశం పార్టీ కోసం యాడ్స్ షూట్ చేస్తున్నాడు. వచ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ప్ర‌చారానికి వాడుకోవ‌డానికి అనువుగా బోయపాటి యాడ్స్ కాన్సెప్ట్‌లు రెడీ చేస్తున్నాడట.

మరి ఇంతకుముందు గోదావరి పుష్క‌రాల‌కు సంబంధించిన యాడ్‌లు కూడా బోయ‌పాటి.. తెలుగు దేశం ప్రభుత్వం కోసం చేసిన సంగ‌తి తెలిసిందే. అందుకే బాలయ్య మూవీ లేట్ అయినా.. బోయపాటి మాత్రం ఎటువంటి కంగారు పడకుండా తన పనిలో నిమగ్నమయ్యాడట. ఇక బోయపాటి - బాలకృష్ణ సినిమా జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజునాడు మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Boyapati Busy with Ad Shoots for TDP:

No Movies to Boyapati.. But He Is Busy Busy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs