Advertisement

స్పెష‌ల్ స్టోరీ: తెలుగు సినిమాపై అమెజాన్ ప‌డ‌గ‌!


`కుబుసం` చిత్రంలో ఓ పాటుంది. `ప‌ల్లె క‌న్నీరు పెడుతుందో కిపించ‌ని కుట్ర‌ల‌...సామ్రాజ్య‌వాద విష‌మెక్కుతున్న‌ద‌మ్మో మెల్లంగా ప‌ల్లెకు..అమెజాన్ ప్రైమ్ పేరుతో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి కూడా సామ్రాజ్య‌వాద విషం మెల్ల మెల్ల‌గా ఎక్కుతోంది. ఇంత‌కు ముందు చిన్న సినిమా లేదా పెద్ద సినిమా విడుద‌లైనా పైర‌సీలో క్లారిటీలేక‌పోవ‌డంతో అలా మ‌స‌క మ‌స‌క‌బారిన ప్రింట్‌లో సినిమాని చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌ని ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌కు వెళ్లేవాడు. ఎప్పుడైతే అమెజాన్ ప్రైమ్ మొద‌లైందో అప్ప‌టి నుంచి థియేట‌ర్ బాట‌ప‌ట్టే స‌గ‌టు ప్రేక్ష‌కుడి ప‌ర్సెంటేజ్ క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డ్డం మొద‌లైంది. 

Advertisement

అది ఇప్పుడు ఏ స్థాయికి చేరింది అంటే ఎంత పెద్ద స్టార్ సినిమా విడుద‌లైనా 40 నుంచి 50 వ‌ర‌కు మాత్ర‌మే ఆక్సుపెన్సీ అయ్యేంత‌. ఇక దీన్ని కూడా త‌గ్గించే కుట్ర జ‌రుగుతోందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. దానికి కార‌ణం చిత్ర నిర్మాత‌లే. త‌న సినిమా విడుద‌ల‌కు ముందే అన్ని రైట్స్‌తో పాటు అమెజాన్ ప్రేమ్ హ‌క్కుల్ని కూడా అమ్మేసి భారీ మొత్తంలో సొమ్ముచేసుకుంటున్నారు. ఇదే రేపు ఇండ‌స్ట్రీని కొలాప్స్ చేయ‌బోతోంద‌ని ఎవ‌రూ అర్థం చేసుకోవ‌డం లేదు. నేను అమ్మిన చిత్రాన్ని 30వ రోజు ప్ర‌ద‌ర్శించుకునే హ‌క్కును క‌ల్పిస్తున్నాను. ఆ స‌మ‌యంలోపు థియేట‌ర్ల‌లో వున్న సినిమాకు ప్రేక్ష‌కులు ఎలాగూ వ‌స్తారు. అన్న ధీమాతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

కానీ కాలం మారింది. స్పీడు యుగంలో త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ డ‌బ్బులు రావాల‌ని నిర్మాత ఎలా ఆలోచిస్తున్నాడో..త‌క్కువ డ‌బ్బుతో ఇంటిల్లిపాది ఒకే ద‌గ్గ‌ర కూర్చుని సినిమాని ఎంజాయ్ చేయాల‌ని స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఆలోచిస్తున్నాడు. ఇంత చిన్న లాజిక్‌ని మిస్స‌వుతున్న నిర్మాత‌లు అత్యాశ‌కు పోయి 30 రోజుల్లోనే త‌ను నిర్మించిన చిత్రం ఇంకా థియేట‌ర్ల‌లో వుండ‌గానే ఆమెజాన్ ప్రైమ్ పేరుతో కిల్ చేసుకుంటున్నాడు. ఇటీవ‌ల సంక్రాంతికి విడుద‌లైన చిత్రాల్లో బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బ‌డిన ఏకైక చిత్రం `ఎఫ్‌2`. ఇందులో విష‌యం ఏమీ లేక‌పోయినా ఎంట‌ర్‌టైన్ చేసిన విధానం న‌చ్చ‌డంతో జ‌నాలు ఎగ‌బ‌డి చూశారు. దీన్ని గ్ర‌హించ‌ని దిల్ రాజు ఈ చిత్రాన్ని 30వ రోజు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేసుకోవ‌చ్చు అంటూ అమ్మేశాడు. దీంతో వ‌ద కోట్లు దాటిన ఈ సినిమా అక్క‌డే ఆగిపోవాల్సి వ‌చ్చింది. ఇలా తెలిసిన వాళ్లు, తెలియ‌ని వాళ్లు ఆమెజాన్ ఉచ్చులో ప‌డి తెలియ‌కుండానే తెలుగు సినిమాని కిల్ చేస్తున్నారు.

ఇదే ప‌ద్ద‌తి కొన‌సాగితే ఈ మాత్రం థియేట‌ర్ల‌కు వ‌చ్చే జ‌నాలు కూడా ముఖం చాటేసే ప్ర‌మాదం వుంది. ముందు భారీ మొత్తం చెల్లించి థియేట‌ర్‌లో సినిమా చూసే కంటే అందులో త‌క్కువ మొత్తాన్ని చెల్లించి ఇంటిల్లిపాదికి అమెజాన్ ప్రైమ్‌లోనే సినిమా చూపిద్దామ‌ని ఫిక్ష‌యితే తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుంది. ఇప్ప‌టికైనా తేరుకుని 30 రోజుల్ని 50 రోజుల‌కు లేదా 40 రోజుల‌కు మార్చుకుంటే స‌గ‌టు ప్రేక్ష‌కుడికి థియేట‌ర్‌లోనే  సినిమాలు చూడాల‌నే  ఆస‌క్తి పెరుగుతుంది. ఇండ‌స్ట్రీలోని కీల‌క వ్య‌క్తులు ఈ విష‌యంపై పున‌రాలోచ‌న చేసి ఇండ‌స్ట్రీని ప‌ది కాలాల పాటు బ్ర‌తికిస్తార‌ని ఆశిద్దాం.  

telugu cinema in danger zone:

amazon damaging telugu cinema
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement