Advertisement
Google Ads BL

NBK ఫిలిమ్స్ సంగతేంటి బాలయ్యా?


వాస్తు, సెంటిమెంట్స్, ముహూర్తాలు, జాతకాలు నమ్మే వాళ్లల్లో బాలకృష్ణ మొదటి స్థానంలో ఉంటాడు. తను ఏ పని చేసినా ముహూర్తం బాగుందా లేదా అని చూసుకుని మరి స్టార్ట్ చేస్తాడు. అలాంటిది తన సొంత బ్యానర్ స్టార్ట్ చేస్తున్నాడు అన్నప్పుడు ఎన్ని  ఆలోచించి ఉంటాడు చెప్పండి! NBK ఫిలిమ్స్ అనే బ్యానర్ ను స్థాపించి మొదటి సినిమానే తన తండ్రి జీవిత చరిత్రను రూపొందించాడు కానీ అది ఫెయిల్ అయింది.  

Advertisement
CJ Advs

రెండు పార్టులుగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం డిజాస్టర్ అవ్వడంతో ఈ దెబ్బకు నిర్మాణ రంగం నుంచి పూర్తిగా తప్పుకునే ఆలోచనకు వచ్చేశాడు బాలకృష్ణ. బాలయ్య అంతే... గతంలో ఆయన డైరెక్షన్ చేద్దాం అనుకున్న నర్తనశాల ప్రాజెక్టు సడన్ గా సౌందర్య చనిపోవడంతో ఆగిపోయింది. అంతే అప్పుడు పూర్తిగా దర్శకత్వాన్నే వదిలేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ అవ్వడంతో పూర్తిగా నిర్మాణాన్ని వదిలేయాలని అనుకుంటున్నాడట.

అన్నీ ఒకేసారి రివర్స్ ఎటాక్ అవ్వడంతో ఎందుకొచ్చిన నిర్మాణం అనే ధోరణిలో మాట్లాడుతున్నాడట బాలయ్య. అయితే తాజాగా వినిపిస్తున్న కథనాలు ప్రకారం NBK ఫిలిమ్స్ లో తొలి, చివరి చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ మాత్రమే అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే బాలయ్య నోరు విప్పాల్సిందే.

Balakrishna Mind Set Changed on NBK Films:

Balakrishna Takes Sensational Decision on his Own Banner
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs