Advertisement
Google Ads BL

118 టీమ్ చాలా సంతోషంగా ఉంది


డైనమిక్‌ హీరో నందమూరి కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటించిన స్టైలిష్‌ యాక్షన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘118’. నివేదా థామస్‌, షాలిని పాండే హీరోయిన్స్‌.  ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి.గుహన్‌ ఈ చిత్రానికి దర్శకుడు.  ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు నిర్మించిన ఈ సినిమా మార్చి 1న విడుదలై సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...

Advertisement
CJ Advs

దిల్ రాజు మాట్లాడుతూ - ‘‘118 కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమా తెలుగు రాష్టాల్లో మా సంస్థ ద్వారా రిలీజ్ అవ్వడం, పటాస్ మూవీ తరువాత మా ఇద్దరి కాంబినేషన్లో విడుదలై సూపర్ హిట్ సాధించడం జరిగింది. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ  సినిమాకు ఆడియన్స్ తో పాటు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక మంచి థ్రిల్లింగ్ సినిమాగా 118 నిలిచింది. గుహన్ నాకు 20 ఏళ్లుగా పరిచయం. ఖుషి సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్. ఆ తరువాత మా బ్యానర్ లో చాలా సినిమాలకు డి ఓపిగా పనిచేశారు ఇప్పుడు దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. మహేష్ ఈ సినిమాతో సక్సెస్ సాధించడం మా  సొంత సినిమా సక్సెస్ అయినంత హ్యాపీగా ఉంది ఈ సందర్భంగా వారిద్దరిని అభినందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండురోజులుగాను 3 కోట్ల షేర్ వచ్చింది.ఇలాగే ఇంకా మంచి కలెక్షన్లు సాధించాలి. ప్రతి ఒక్కరూ సినిమా చూడండి’’ అన్నారు.

దర్శకుడు కె వి గుహన్ మాట్లాడుతూ - ‘‘ముందుగా మా సినిమాను విజయవంతం చేసిన ఆడియన్స్, మీడియా వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి ఫిలిమ్స్ కి మీరు అందించిన రెస్పాన్స్ ఇంకా మరెన్నో సినిమాలు తీయడానికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది. అన్ని పాజిటివ్ రివ్యూస్ తో రోజు మొదలైంది అప్పటినుంచి ప్రతి ఒక్కరూ పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. దిల్ రాజు గారు చెప్పినట్టు మా ఇద్దరిది ఇరవై ఏళ్ళ అనుబంధం. ఆయన నాకు గాడ్ బ్రదర్ లాంటి వారు. ఆయన 118 మంచి సినిమా అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ - ‘‘పటాస్ రిలీజ్ అయ్యి నాలుగు సంవత్సరాలు అయింది. అప్పుడు కూడా దిల్ రాజు గారు, శిరీష్  గారు మా సినిమా చూసి మా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మా ప్రయత్నాన్ని మీరందరు అభినందిచారు. మళ్ళీ నాలుగు ఏళ్ల తరువాత ఈ 118 సినిమా చూడడం జరిగింది. చాలా ఎక్సయిట్ అయ్యి ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో వారి సంస్థ ద్వారా విడుదల చేయడం జరిగింది. అలా మళ్ళీ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే  మా నిర్మాత మహేష్ గారికి సపోర్ట్ గా ఉన్న శిరీష్ గారికి థాంక్స్. ప్రతి ఒక్కరూ సినిమా చూడండి అన్నారు. 

నిర్మాత మహేష్ ఎస్ కోనేరు మాట్లాడుతూ - ‘‘118 సినిమా విడుదలై అద్భుతమైన టాక్ తో మంచి రెవిన్యూతో ప్రదర్శించబడుతోంది. ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఈ సినిమాకు మాకు ఫస్ట్ ధైర్యాన్ని ఇచ్చిన తారక్ కి థాంక్స్. ఆ తరువాత అంతటి ధైర్యాన్ని దిల్ రాజు గారు శిరీష్ గారు ఇవ్వడం జరిగింది. వారి నమ్మకంతో సినిమా విజయవంతంగా రన్ అవుతోంది. ఈ శివరాత్రికి మీరందరు కుటుంబసమేతంగా వెళ్ళి సినిమా చూడాలి అని కోరుకుంటున్నారు’’ అన్నారు.

118 Success Meet Details:

118 Team Celebrates Success with Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs